News December 27, 2025

భూపాలపల్లి: పోలీసుల పనితీరు అభినందనీయం: ఎస్పీ

image

భూపాలపల్లి జిల్లాలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ సంకిర్త్ అభినందించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు జరగడం వల్లనే బాధితులకు న్యాయం చేకూరుతుందని, నేరస్తులకు శిక్షలు పడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే ఏడాదిలో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ, జిల్లాను నేరరహితంగా మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News December 31, 2025

KNR: ఆన్‌లైన్ బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి

image

ఆన్‌లైన్ బెట్టింగ్‌ల ఉచ్చులో చిక్కుకుని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తోట ఆదిత్య(34) ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వల్ల ఏర్పడిన సమస్యలతో మనస్తాపానికి గురై తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

News December 31, 2025

మహిళలకు అత్యంత అనుకూలమైన దేశం డెన్మార్క్‌

image

ఉమెన్‌ పీస్‌ అండ్‌ సెక్యూరిటీ (WPS) ఇండెక్స్‌-2025లో మహిళలకు అత్యంత అనుకూలమైన దేశంగా డెన్మార్క్‌ అగ్ర స్థానంలో నిలిచింది. ఉద్యోగ, ఉపాధితోపాటు ప్రతి రంగంలోనూ ఇక్కడి మహిళలకు విస్తృతమైన అవకాశాలు, భద్రత లభిస్తోంది. లింగవివక్ష, మహిళలపై హింస ఉండవు. కీలక నిర్ణయాల్లో మహిళల ప్రాతినిధ్యం, బలమైన చట్టాలు, సురక్షిత వాతావరణం, ఆరోగ్యం-చదువులో ఉన్నత ఫలితాలు సాధించడం వంటివి దీన్ని లెక్కించే సూచికలు.

News December 31, 2025

శివలింగం ధ్వంసంపై ‘అచ్చెన్న’ ఆగ్రహం.. నిందితులను వదలొద్దు!

image

ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం ఘటనపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం అధికారులను ఆరా తీశారు. కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఆయన.. దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. హిందూ దేవాలయాలపై దుశ్చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక కేంద్రాల వద్ద భద్రతను పెంచాలని సూచించారు.