News December 28, 2025

భూపాలపల్లి: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: ఎస్పీ

image

నూతన సంవత్సరంలో ప్రజలకు మరింత వేగవంతమైన, మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి అధికారి అంకితభావంతో పనిచేసి జిల్లాను నేరరహితంగా తీర్చిదిద్దాలన్నారు,

Similar News

News December 31, 2025

చిత్తూరు జిల్లాలో 1021 సెల్ ఫోన్ల రికవరీ

image

చిత్తూరు జిల్లాలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని భారీగా సెల్‌ఫోన్లు రికవరీ చేశారు. జిల్లా వ్యాప్తంగా రూ.2.42 కోట్ల విలువైన 1021 ఫోన్లను చాట్ బాట్ ద్వారా పోలీసులు రికవరీ చేశారు. మూడు దశల్లో సెల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు వాటిని బాధితులకు అప్పగించారు. చోరీ అయిన వెంటనే బాధితులు తమ ఫోన్ల కోసం పోలీసులను ఆశ్రయిస్తుండటంతో రికవరీ శాతం పెరిగింది.

News December 31, 2025

అంతిమ యాత్ర తర్వాత వెనక్కి ఎందుకు చూడకూడదు?

image

శరీరం దహనమైనా ఆత్మ ఉనికిలోనే ఉంటుందట. తన కుటుంబంతో ఉన్న అనుబంధం కోసం ఎదురు చూస్తూ ఉంటుందట. గరుడ పురాణం ప్రకారం.. శ్మశానం నుంచి వెనుదిరిగేటప్పుడు వెనక్కి చూస్తే, ఆత్మకు బంధువులపై మమకారం పెరిగి ఈ లోకాన్ని విడిచి వెళ్లడం కష్టమవుతుందని నమ్ముతారు. ఆత్మ తన పాత గుర్తింపు వదిలి కొత్త ప్రయాణం ప్రశాంతంగా మొదలుపెట్టాలనే ఉద్దేశంతోనే, బంధాన్ని తెంచుకుంటూ ఎవరూ వెనక్కి తిరిగి చూడకూడదని అంటారు.

News December 31, 2025

GNT: ఆంధ్రా మిర్చికి అంతర్జాతీయ క్రేజ్

image

ఆంధ్రప్రదేశ్ మిర్చికి అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థలు మన రైతుల నుంచి నేరుగా మిర్చి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. సాస్‌లు, కేఎఫ్‌సీ మసాలాలు, ఫార్మా రంగాల్లో గుంటూరు మిర్చిని విరివిగా వాడుతున్నారు. విదేశీ ప్రతినిధులు పంటను పరిశీలించి మెగా డీల్స్ కుదుర్చుకుంటున్నారు. ఈ ఎగుమతులతో రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి.