News February 28, 2025

భూపాలపల్లి: ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పనిసరి: ఎస్పీ

image

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పనిసరి అని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో AR హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన, హెడ్ కానిస్టేబుల్ గుండు నాగభూషణంను ఎస్పీ శాలువా, పులమాలతో ఘనంగా సత్కరించారు. అలాగే ఆయన సతీమణి పద్మకు గృహోపకరణాలు అందజేశారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమని ఎస్పీ అన్నారు.

Similar News

News March 1, 2025

సిరిసిల్ల: ఇంటర్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

రాజన్న సిరిసిల్ల జిల్లా లో మార్చి 5, నుంచి మార్చి 25వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేశామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఉ. 9.00 నుంచి మ.12.00 వరకు పరీక్షలు జరుగుతాయని, ఇంటర్ మొదటి సంవత్సరంలో 5065 మంది, రెండవ సంవత్సరంలో 4245 మొత్తం 9310 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ఇందుకు గాను 16 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News March 1, 2025

అమెరికాను జెలెన్‌స్కీ అవమానించారు: ట్రంప్

image

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలె‌న్‌స్కీతో గొడవపై ట్రంప్ స్పందించారు. ఆయన వైట్‌హౌస్‌ బయట మీడియాతో మాట్లాడారు. ‘అమెరికాను జెలెన్‌స్కీ అవమానించారు. ఎప్పుడైతే ఆయన శాంతి స్థాపనకు సిద్ధపడతారో అప్పుడే మళ్లీ ఇక్కడికి వస్తారు’ అని పేర్కొన్నారు. కాగా అంతకుముందు ట్రంప్‌తో జెలె‌న్‌స్కీ వాగ్వాదానికి దిగడాన్ని US ఉపాధ్యక్షుడు వాన్స్ తప్పుబట్టారు. మీడియా ముందు తమ అధ్యక్షుడిని అగౌరవపరిచారని మండిపడ్డారు.

News March 1, 2025

మాకు శాశ్వత శాంతి కావాలి: జెలె‌న్‌స్కీ

image

వైట్‌హౌస్‌లో US అధ్యక్షుడు ట్రంప్‌తో వాగ్వాదం అనంతరం భేటీ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ట్వీట్ చేశారు. ‘థాంక్యూ US. మీ మద్దతుకు కృతజ్ఞతలు. థాంక్యూ ప్రెసిడెంట్. ఉక్రెయిన్‌కు శాశ్వత శాంతి కావాలి. మేం అందుకోసమే పనిచేస్తున్నాం’ అని రాసుకొచ్చారు. కాగా రష్యాతో ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలనుకోవడం లేదని, జెలెన్‌స్కీ శాంతిని కోరుకోవడం లేదని అంతకుముందు ట్రంప్ ఆరోపించారు.

error: Content is protected !!