News December 11, 2025
భూపాలపల్లి: ప్రశాంతంగా మొదటి విడత ఎన్నికల ప్రక్రియ

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మొదటి విడత ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మొదటి విడత ఎన్నికల ప్రక్రియలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, పోలీసులు సమన్వయంతో సమర్ధవంతంగా విధులు నిర్వహించారని తెలిపారు. మొత్తం 107690 ఓటర్లు ఉండగా, వారిలో 88588 మంది ఓటర్లు ఓటు హక్కు విజయోగించు కున్నారని, 82.26 శాతం ఓటింగ్ జరిగిందని అన్నారు.
Similar News
News December 13, 2025
వరంగల్: బాబోయ్.. అక్కడ పనిచేయడం కష్టమే!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ అధికారి పేరు చెబితే సిబ్బంది వణికిపోతున్నారు. అక్కడ ఆ అధికారి దగ్గర పనిచేయడానికి సైతం జంకుతున్నారు. 18 నెలల్లో 20 మంది సెక్యూరిటీ సిబ్బంది, ఆరుగురు క్యాంప్ క్లర్క్‌లు, 10 మంది వంటవారిని మార్చడంతో ఆ అధికారి హాట్ టాపిక్ అయ్యారు. ఇంతకు ఎందుకు మార్చుతున్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఏ సెటిల్మెంట్లు లేకపోయినా సిబ్బందిని మార్చడం ఉద్యోగుల సర్కిళ్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
News December 13, 2025
‘స్క్రబ్ టైఫస్’పై భయాందోళనలు వీడాలి- DMHO

‘స్క్రబ్ టైఫస్’పై ప్రజల్లో అపోహలు, భయాందోళనలు వద్దని DMHO డా. కె.వెంకటేశ్వర రావు స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 3 ‘స్క్రబ్ టైఫస్’ కేసులు మాత్రమే గుర్తించామనిని, అవి కూడా సాధారణ ఆరోగ్య పరీక్షలలో భాగంగా నిర్ధారణ అయినవేనని తెలిపారు. జిల్లాలో ఎక్కడా ‘స్క్రబ్ టైఫస్’ వ్యాప్తి పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. ‘స్క్రబ్ టైఫస్’ అనేది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపించే వ్యాధి కాదన్నారు.
News December 13, 2025
ఆదిలాబాద్: ‘బెదిరింపులకు పాల్పడితే చెప్పండి’

తినే పదార్థాలు తయారు చేసే యజమానులు ఎట్టి పరిస్థితుల్లో నిషేధిత రంగులు వాడకూడదని ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష అన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్, ట్రేడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో సురక్షిత ఆహారం, ఆరోగ్యంపై అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. వస్తువులను వినియోగదారులు పరిశీలించి కొనాలన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తమను సంప్రదించాలన్నారు. అధ్యక్షుడు దినేష్ ఉన్నారు.


