News March 5, 2025
భూపాలపల్లి: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

మహాముత్తారం మండలానికి చెందిన ఓ బాలికపై 2019లో అత్యాచారానికి పాల్పడ్డ కేసులో మంగళవారం నిందితుడు అట్టెం మల్లయ్యకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానాను విధిస్తూ భూపాలపల్లి జిల్లా కోర్టు న్యాయమూర్తి పి.నారాయణబాబు తీర్పు ఇచ్చారు. ఈ కేసులో జిల్లా స్పెషల్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ విష్ణువర్ధన్ రావు వాదనలు వినిపించగా పోలీసులు సాక్షాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో నిందితుడికి శిక్ష పడింది.
Similar News
News February 18, 2026
NRPT: వీధి కుక్కల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలి

వీధి కుక్కల నియంత్రణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కార్యాచరణ జంతు జనన నియంత్రణ (ABC), రేబిస్ టీకాలపై ప్రత్యేక దృష్టి పెట్టి స్టెరిలైజేషన్ వేగవంతం చేస్తూనే, ప్రమాదకరమైన కుక్కల కోసం ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్‌లో పశు సంవర్ధక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కుక్కలకు జనాభా నియంత్రణ టీకాలు వేయాలన్నారు.
News February 18, 2026
మిలాన్ ఏర్పాట్లపై సీపీ సమీక్ష

విశాఖలో రేపు జరగనున్న మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి స్వయంగా పర్యవేక్షించారు. బీచ్ రోడ్డులోని హోల్డింగ్ పాయింట్లు, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో డ్రోన్లు, సీసీటీవీలు, సోషల్ మీడియా డెస్క్, భద్రతా వ్యవస్థల నిఘాను తనిఖీ చేసి, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
News February 18, 2026
ఇరాన్‌పై త్వరలోనే అమెరికా, ఇజ్రాయెల్ దాడి?

అమెరికా ఇరాన్‌పై త్వరలోనే భారీ మిలిటరీ ఆపరేషన్ లాంచ్ చేయనున్నట్లు రిపోర్ట్స్ రావడం కలకలం రేపుతోంది. ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు విఫలమైతే దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని ఆక్సియాస్ ఏజెన్సీ రిపోర్ట్ వెల్లడించింది. అదే జరిగితే ఆ ఆపరేషన్ కొన్ని వారాల పాటు కొనసాగుతుందని అంచనా వేసింది. న్యూక్లియర్, మిసైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరే లక్ష్యంగా ఇజ్రాయెల్‌తో కలిసి ఈ ఆపరేషన్ చేపట్టనున్నట్లు తెలిపింది.


