News February 28, 2025
భూపాలపల్లి: బోనస్ నగదు జమకాక రైతులు ఇబ్బందులు

రైతులకు వరి ధాన్యం బోనస్ నగదు జమ కాక ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం విక్రయించి 50 రోజులు గడుస్తున్నా నగదు జమ కావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రూ.2,320 మద్దతు ధరతో పాటు.. క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తోందని, జిల్లాలో దాదాపు 81,700 మెట్రిక్ టన్నులు సన్న ధాన్యాన్ని విక్రయించగా రూ.16 కోట్లు మాత్రమే నగదు జమకాగ.. రూ.24 కోట్ల నగదు చెల్లించాల్సి ఉందని అధికారులు తెలిపారు.
Similar News
News February 28, 2025
పోసాని బెయిల్ పిటిషన్.. సోమవారం విచారణ

APFDC మాజీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. ఆయన తరఫు న్యాయవాది రైల్వేకోడూరు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా జడ్జి విచారణకు స్వీకరించలేదు. రేపటి నుంచి ట్రైనింగ్‌కు వెళ్తున్నందున ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. శని, ఆదివారం సెలవు కావడంతో సోమవారమే విచారణ జరిగే అవకాశం ఉంది. కోర్టు పోసానికి 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆయనను రాజంపేట సబ్‌జైలుకు తరలించారు.
News February 28, 2025
ఫేక్ జాబ్ నోటిఫికేషన్‌తో స్కామర్ల కొత్త మోసం..!

ఉద్యోగ వేటలో ఉన్న వారిని సైబర్ నేరగాళ్లు నిండా ముంచుతున్నారు. లింక్డ్‌ఇన్‌లో ఫేక్ జాబ్ నోటిఫికేషన్లను స్కామర్లు పోస్ట్ చేస్తున్నట్లు సైబర్ నిపుణులు గుర్తించారు. ‘జాబ్ అప్లై చేసిన వారికి స్కామర్లు కాల్ చేసి ‘Grass Call’ అనే వీడియో కాల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయిస్తున్నారు. దీనిద్వారా సదరు వ్యక్తి ఫోన్, కంప్యూటర్‌లోని డేటా, బ్యాంక్ వివరాలతో సహా ప్రైవసీ సమాచారాన్ని తస్కరిస్తున్నారు’ అని వారు తెలిపారు.
News February 28, 2025
సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు: జిల్లా ఎస్పీ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. జిల్లాలో సీఎం పర్యటన సందర్బంగా ట్రయిల్ రన్ నిర్వహించారు. మార్చి నెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బందోబస్తు విధులలో పాల్గొనే పోలీసు అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.