News December 13, 2025
భూపాలపల్లి: భార్యను చంపి భర్త ఆత్మహత్య

జిల్లాలో దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గణపురం మండలం సీతారాంపురంలో బాలాజి రామాచారి తన భార్య సంధ్య (42)ను ఉరివేసి హత్య చేశాడు. అనంతరం తాను ఉరి వేసుకొని మృతి చెందాడు. మొదటి భార్య మరణించాక సంధ్యను వివాహం చేసుకున్నాడు. కూతురు, భార్య వేధింపులు తాళలేక ఈ దారుణానికి పాల్పడినట్లు వీడియో తీసి స్టేటస్ పెట్టాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 15, 2025
సిల్వర్ జువెలరీ ఇలా సేఫ్

* మేకప్, పెర్‌ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నాకే వెండి ఆభరణాలు ధరించాలి. లేదంటే ఆ రసాయనాలు మెరుపును తగ్గిస్తాయి. * వర్షంలో జువెలరీ తడిస్తే వెంటనే ఆరబెట్టి, పొడి వస్త్రంతో తుడుచుకోవాలి. * కెమికల్ స్ప్రేలతో కాకుండా వెనిగర్, బేకింగ్ సోడా వంటి వాటితో వాటిని శుభ్రం చేయాలి. *జువెలరీని గాలి తగలని ప్రదేశంలోనే ఉంచాలి. ఇతర ఆభరణాలతో కలపకూడదు. జిప్ లాక్ ఉండే ప్లాస్టిక్ బ్యాగ్‌లలో భద్రపరుచుకోవాలి.
News December 15, 2025
కొత్తపేట: బాలసుబ్రహ్మణ్యం విగ్రహ శిల్పి మనోడే

హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని సోమవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ 7.2 అడుగుల కాంస్య విగ్రహాన్ని కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి వడయార్ రాజ్‌కుమార్ రూపొందించారు. ప్రముఖుల విగ్రహాలు చెక్కడంలో సిద్ధహస్తుడైన రాజ్‌కుమార్ చేతుల మీదుగా ఇప్పటికే వేలాది శిల్పాలు రూపుదిద్దుకున్నాయి. బాలు విగ్రహాన్ని అత్యంత సహజంగా మలిచినందుకు పలువురు ఆయనను ప్రశంసించారు.
News December 15, 2025
నల్గొండ: సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని వినతిపత్రం

నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో డిసెంబర్ 30 నుంచి నిర్వహించే పీజీ 3 సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌కి ఏబీవీపీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. యూనివర్సిటీ అధ్యక్షుడు హనుమాన్ మాట్లాడుతూ.. డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వరకు నెట్ పరీక్ష ఉన్నందున విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వాయిదా వేయాలని కోరారు. యూనివర్సిటీ కార్యదర్శి మోహన్, విజయ్, వెంకటేశ్, సుధీర్ పాల్గొన్నారు.


