News February 24, 2026
భూపాలపల్లి: మత్స్యకారులకు గుడ్ న్యూస్

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మత్స్యకారులు, మత్స్య సహకార సంఘాల సభ్యులకు “మోటార్ సైకిల్ విత్ ఐస్ బాక్స్” పథకానికి దరఖాస్తులు ఆహ్వానించారు. మొత్తం 13 యూనిట్లు మంజూరు చేయనున్నారు. జనరల్ వారికి 40%, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 60% సబ్సిడీ ఉంటుంది. అర్హులు మార్చి 5, 2026లోగా జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేయాలని అధికారులు తెలిపారు.
Similar News
News April 14, 2026
3 నెలలు తట్టుకోగలరా?.. అమెరికాకు ఇరాన్ కౌంటర్

హార్ముజ్ జలసంధిని అమెరికా బ్లాక్ చేయడంపై ఇరాన్ దీటుగా స్పందించింది. తమకు ఇబ్బందేం లేదని, 90 రోజులు ఎలాంటి ఆటంకం లేకుండా సప్లై చేయగలమని పేర్కొంది. ‘ఇరాన్‌ను దిగ్బంధిస్తానని ఆయన(ట్రంప్) బెదిరించాడు. 3 నెలలపాటు అమ్ముకోవడానికి సరిపడా చమురు నిల్వ మా ట్యాంకర్లలో ఉంది. మీరు, మీ మిత్రదేశాలు అన్ని రోజులు తట్టుకోగలరని మీకు నమ్మకముందా?’ అని బల్గేరియాలోని ఇరాన్ ఎంబసీ ప్రశ్నించింది.
News April 14, 2026
IPL: CSKతో మ్యాచ్.. KKR బోణీ కొడుతుందా?

IPLలో భాగంగా ఇవాళ చెన్నై, కోల్‌కతా తలపడనున్నాయి. ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాయి. ఒక మ్యాచ్ వర్షంతో రద్దు కాగా, ఆడిన 3 మ్యాచుల్లోనూ KKR ఓడింది. దీంతో ఇవాళ్టి మ్యాచులో గెలవాలని భావిస్తోంది. మరోవైపు హ్యాట్రిక్ ఓటముల తర్వాత గత మ్యాచ్‌లో విజయం సాధించి చెన్నై టచ్‌లోకి వచ్చింది. అదే ఊపుతో విక్టరీ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News April 14, 2026
దేశంలోనే తొలి ‘క్వాంటం’ కేంద్రం.. అమరావతిలో నేడే ప్రారంభం

AP: దేశంలోనే తొలి క్వాంటం కేంద్రం రాష్ట్రంలో ఏర్పాటు కాబోతోంది. అమరావతి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్(AQRS)ను CM చంద్రబాబు ఇవాళ 2PMకు ప్రారంభించనున్నారు. అమరావతిలోని SRM వర్సిటీలో ఓ ఫెసిలిటీ(1 S), గన్నవరంలోని మేథ టవర్స్‌లో మరొకటి(1 Q) ఆవిష్కృతం కానున్నాయి. దీంతో <<19081669>>క్వాంటం కంప్యూటర్<<>> హార్డ్‌వేర్‌ను పరీక్షించి, సర్టిఫై చేసే సామర్థ్యం క్వాంటం వ్యాలీకి రానుంది.


