News January 14, 2026

భూపాలపల్లి: ముంగిట ముగ్గులు.. వీధిలో భోగి మంటలు

image

జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పండగ తొలిరోజైన బుధవారం తెల్లవారుజామునే పల్లెలు, పట్టణాలు భోగి మంటల కాంతులతో మెరిసిపోయాయి. యువత చిందులు వేస్తూ సంబరాలు జరుపుకోగా, మహిళలు తమ ఇంటి ముంగిట తీరొక్క రంగులతో ముగ్గులు వేసి, గొబ్బెమ్మలతో అలంకరించారు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం పట్టణాల్లో ఉండేవారు పల్లెలకు చేరుకోవడంతో గ్రామాల్లో సందడి నెలకొంది.

Similar News

News February 1, 2026

7 హైస్పీడ్ రైళ్లు.. హైదరాబాద్‌కు అగ్ర తాంబూలం!

image

దేశంలో 7 హైస్పీడ్ రైల్ కారిడార్స్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో 3 హైదరాబాద్ మీదుగా నడవనున్నాయి. ముంబై-పుణే, హైదరాబాద్-బెంగళూరు, పుణే-హైదరాబాద్, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగుడి మధ్య ఇవి నడవనున్నాయి. వచ్చే ఐదేళ్లలో 20 కొత్త జల మార్గాలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

News February 1, 2026

GST కలెక్షన్స్@ 1.93లక్షల కోట్లు

image

జనవరిలో జీఎస్‌టీ కలెక్షన్లు భారీగా నమోదయ్యాయి. గత ఏడాది జనవరితో పోలిస్తే ఈసారి 6.2% వృద్ధి నమోదైంది. మొత్తం గ్రాస్ కలెక్షన్స్ ఈసారి ₹1,93,384కోట్లు వసూలయ్యాయి. ఇక నెట్ రెవెన్యూ ₹1.70లక్షల కోట్లుగా ఉంది. దేశీయంగా మార్కెట్‌లో డిమాండ్ పెరగడం, ఇంపోర్ట్ రెవెన్యూ పెరగడం ఈ వసూళ్లకు కలిసొచ్చాయి. కాగా టోటల్ రిఫండ్స్ గతఏడాది జనవరితో పోలిస్తే 3.1% తగ్గి ₹22,665 కోట్లుగా నమోదైంది.

News February 1, 2026

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

image

TG: ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపునకు రూ.720 కోట్లు విడుదల చేసింది. అలాగే 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు సరెండర్ లీవుల ఎన్‌క్యాష్‌మెంట్ క్లియర్ చేసింది. ఈ నేపథ్యంలో ఒకేసారి ఉద్యోగుల ఖాతాల్లో పెండింగ్ బిల్లులు పడనున్నాయి. మరోవైపు గ్రాట్యుటీ GPF సరెండర్ లీవ్ అడ్వాన్సులను విడుదల చేసింది.