News January 12, 2026

భూపాలపల్లి: మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. హోదాలవారీగా ఎన్నికల సిబ్బందిని నియమించుకోవాలని తెలిపారు. మున్సిపల్, రెవెన్యూ తదితర శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి ఎన్నికల నిర్వహణలో లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. సీఎస్ రామకృష్ణారావు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

Similar News

News April 9, 2026

పల్నాడు: పాలు తేవడానికి వెళ్లి.. తిరిగిరాని లోకాలకు.!

image

శావల్యాపురం (M) కనమర్లపూడిలో గరువారం ఉదయం <<19603793>>ప్రమాదం <<>>జరిగిన విషయం తెలిసిందే. పదో తరగతి పూర్తి చేసిన రవీంద్ర పాల ప్యాకెట్ తీసుకురావడం కోసం బైక్‌పై గుంటూరు-కర్నూలు జాతీయ రహదారిపైకి వచ్చాడు. అదే సమయంలో వినుకొండ నుంచి నరసరావుపేట వైపు వెళ్తున్నట్రాలీ ఆటో ఢీకొట్టడంతో బాలుడు స్పాట్‌లోనే మృతి చెందాడు. అల్లారుముద్దుగా పెరిగిన కొడుకు కళ్లముందే విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

News April 9, 2026

EMIలు కట్టే వారికి గుడ్‌న్యూస్

image

రెపో రేటులో RBI ఎలాంటి మార్పులు <<19596095>>చేయనప్పటికీ<<>> లోన్ EMIలు తగ్గనున్నాయి. 2025లో RBI రెపో రేటులో 1.25%(125 బేసిస్ పాయింట్లు) కోత పెట్టినా బ్యాంకులు మాత్రం కొత్త లోన్లపై 89 BPs, యాక్టివ్ లోన్లపై 87BPs తగ్గించాయి. అంటే మరో 36 BPsను తగ్గించేందుకు అవకాశం ఉంది. వచ్చే 3 నెలల్లో రెపో రేటు కోత ప్రయోజనాలను బ్యాంకులు వినియోగదారులకు అందించనున్నాయి. దీంతో ఇంటి, వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే ఛాన్స్ ఉంది.

News April 9, 2026

భద్రాద్రిలో వైభవంగా నిత్య కళ్యాణం

image

దక్షిణ అయోధ్య భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్య కళ్యాణం వేడుక కనులపండువగా జరిగింది. ఉదయం మూలవరులకు అభిషేకాలు నిర్వహించిన అనంతరం, ఉత్సవ మూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించి శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించారు. ఈ వేడుకను దర్శించుకున్న భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. స్వామివారి ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు.