News February 8, 2026

భూపాలపల్లి: మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష

image

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై భూపాలపల్లి సహా పలు జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ పాల్గొన్నారు. పోలింగ్ ఏర్పాట్లు, భద్రత, ఎంసీసీ అమలుపై పటిష్ఠ పర్యవేక్షణ ఉండాలని సూచించారు. 9వ తేదీ సాయంత్రం 5 తర్వాత సైలెన్స్ పీరియడ్ అమలు కఠినంగా చూడాలని ఆదేశించారు.

Similar News

News April 8, 2026

KNR: మామూళ్లు ఇస్తేనే CMRF చెక్కులు

image

CMRFతో ఆర్థిక చేయూత అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. ఉమ్మడి KNR జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో చోటా లీడర్లు దళారుల అవతారం ఎత్తి చెక్కుల పంపిణీలో మామూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వీరికి ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయ సిబ్బంది సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రూ.50 వేల చెక్కుకు పదివేలు, రూ.లక్ష చెక్కుకు రూ.15- 20 వేలు, రూ.లక్ష పైన చెక్కులకు రూ.30-50 వేలు వసూళ్లు చేస్తున్నారట.

News April 8, 2026

పాకిస్థాన్‌ను ఇరాన్ ఎందుకు నమ్మింది?

image

అరబ్ దేశాలకు అమెరికాతో మంచి సంబంధాలు ఉండటం, సైనికులకు ఆశ్రయం ఇవ్వడంతో ఇరాన్ వాటిని నమ్మలేదు. ఇరాన్‌తో పాకిస్థాన్ సరిహద్దును పంచుకుంటోంది. ఎన్నో ఏళ్లుగా ఈ రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు బలంగా ఉన్నాయి. ఇరాన్ మంత్రి అరాఘ్చీ.. షరీఫ్, మునీర్‌ను ‘ప్రియమైన సోదరులు’ అని సంబోధించారు కూడా. పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్‌తో పాక్‌కు మెరుగైన సంబంధాలు లేకపోవడం అతి ముఖ్య కారణం.

News April 8, 2026

అమరావతికి అంతర్జాతీయ స్థాయి కనెక్టివిటీ: TDP

image

అమరావతి రాజధానిగా దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలతో రోడ్డు, రైలు, గాలి, పోర్టు మార్గాల ద్వారా అనుసంధానమవుతుందని TDP సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. కృష్ణా నది తీరాన ఉండటంతో నీటి కొరత ఉండదని, అద్భుతమైన కనెక్టివిటీ కారణంగా పెట్టుబడిదారులు క్యూ కడతారని ధీమా వ్యక్తం చేసింది. అమరావతిలో భారీగా సంపద సృష్టి జరిగి, రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ప్రధాన కేంద్రంగా రాజధాని మారుతుందని తెలిపింది.