News December 25, 2025
భూపాలపల్లి: యాసంగి సాగు 1,26,805 ఎకరాల్లో

భూపాలపల్లి జిల్లాలో యాసంగి ప్రణాళిక 1,26,805 ఎకరాలు ఖరారు చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు తెలిపారు. వరి 97,570 ఎకరాలు, మొక్కజొన్న 29,540 ఎకరాల్లో, వేరుశెనగ, పెసర పంటలు సాగులో ఉన్నాయి. వరి పంట సేద్యానికి 22,567 క్వింటాల్లు, మొక్కజొన్న 2157 క్వింటాల్లు విత్తనాలు అవసరమని తెలిపారు. యూరియా 16,866 టన్నులు, ఫాస్పరస్ 6,887 టన్నులు, పొటాషియం 4688 టన్నులు అవసరమని డీఏఓ బాబురావు తెలిపారు.
Similar News
News December 29, 2025
ADB: యూరియా పంపిణీ ప్రశాంతంగా చేయాలి

రబీ సీజన్‌లో యూరియా పంపిణీ ప్రశాంతంగా చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. ASF జిల్లా అదనపు కలెక్టర్ వీసీ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు. యూరియా పంపిణీ, నిల్వలు, కేంద్రాల వద్ద ఏర్పాట్లపై సమీక్షించారు.
News December 29, 2025
శుభవార్త: దగదర్తి ఎయిర్ పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్

జిల్లా వాసుల చిరకాల కోరిక దగదర్తి విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. విమానాశ్రయం భూసేకరణకు సంబంధించిన సమగ్ర నివేదికను కలెక్టర్ హిమాన్షు శుక్లా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. సోమవారం అమరావతిలో ఈ నివేదికను క్యాబినెట్ ఆమోదించింది. దీంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.
News December 29, 2025
NLG: యూరియా పంపిణీలో పారదర్శకత ఉండాలి: కలెక్టర్

రైతులకు యూరియా పంపిణీ ప్రక్రియలో ఎటువంటి లోపాలు లేకుండా నిరంతర నిఘా ఉంచాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సాగు పనుల దృష్ట్యా ఎరువుల పంపిణీ వద్ద వివాదాలు చోటుచేసుకోకుండా మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. పత్తి కొనుగోలు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌లో తలెత్తే సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.


