News February 26, 2026

భూపాలపల్లి: రిజిస్ట్రేషన్లకు రేపే ఆఖరు!

image

జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మందకోడిగా సాగుతోంది. పీఎం కిసాన్ వంటి పథకాలకు కీలకమైన 11 అంకెల యూనిక్ ఐడీ కోసం ఫిబ్రవరి 28తో గడువు ముగియనుంది. జిల్లాలో లక్షా 21 వేల మంది రైతులు ఉండగా, ఇంకా 44,359 మంది నమోదు చేసుకోవాల్సి ఉంది. ఆధార్ తరహాలో ఈ గుర్తింపు కార్డు తప్పనిసరని అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో రైతులు ముందుకు రాకపోవడం గమనార్హం.

Similar News

News February 26, 2026

గోదావరి పుష్కరాలకు పకడ్బందీగా ఏర్పాట్లు: సీతక్క

image

2027లో జరిగే గోదావరి పుష్కరాల కోసం ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, ఇప్పటి నుంచే అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. గోదావరి నదిపై నాలుగు పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పార్కింగ్ స్థలంపై దృష్టి సారించాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం, ప్రత్యేక గదులు ఏర్పాటు, ప్రజల భద్రతపై చర్యలు చేపట్టాలన్నారు. పాత ఘాట్ల వద్ద అవసరమైన మరమ్మతులు చేయించాలని సూచించారు.

News February 26, 2026

సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

<>సోలార్ <<>>ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(SECI) 19 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BTech/BE, CA, MBA/PGDM, MCom/BCom అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 23 వరకు అప్లై చేసుకోవచ్చు. GMకు గరిష్ఠ వయసు 55, మేనేజర్‌కు 40ఏళ్లు, మిగతా పోస్టులకు 28ఏళ్లు. స్క్రీనింగ్ టెస్ట్/ రాత పరీక్ష/ ట్రేడ్ టెస్ట్/ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.seci.co.in

News February 26, 2026

ఇందిరమ్మ ఇళ్లపై కడియం శ్రీహరి సమీక్ష

image

జనగామ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసి ఒక్క ఇల్లు కూడా ల్యాప్స్ కాకుండా చూడాలని, సాగునీరు అందక ఒక్క ఎకరం ఎండిపోకూడదని అధికారులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. కలెక్టర్‌ షేక్ రిజ్వాన్ బాషా, అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్‌తో సమీక్షలో ఇళ్ల పనులు వెంటనే ప్రారంభించాలని, ప్రభుత్వ భూముల వివరాలు సేకరించాలని ఆదేశించారు.