News December 19, 2025

భూపాలపల్లి: రెండు ఓట్లతో సర్పంచ్‌గా గెలుపు

image

జిల్లాలోని మహా ముత్తారం మండలం పోలారం పంచాయతీ సర్పంచిగా అంబాల రాజబాబు రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019 జనవరి 25న జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోగా, ఈసారి ప్రజలు ఆయన్ను రెండు ఓట్ల తేడాతో గెలిపించారు. సర్పంచ్ పదవి వరించడంతో రాజబాబు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 19, 2025

అత్యధిక గన్ లైసెన్సులు యూపీలోనే

image

ప్రపంచంలో ప్రతి 100 మందిలో ఐదుగురికి గన్స్ ఉన్నాయి. ఇండియాలో మాత్రం ఆ సంఖ్య చాలా తక్కువ. RTI ద్వారా అడిగిన దానికి స్పందనగా 2023 వరకు ఉన్న డేటాను MHA వెల్లడించింది. దేశంలో మొత్తం గన్ లైసెన్సులు 33-40 లక్షల వరకు ఉన్నాయి. UPలో 13.29 లక్షలు, J&Kలో 4-5 L, పంజాబ్‌లో 3.46 L, లైసెన్సులు ఉన్నాయి. బిహార్, మణిపుర్ వంటి హైసెన్సివిటీ రాష్ట్రాల్లోనూ ఆ సంఖ్య తక్కువే కావడం విశేషం. దక్షిణాదిలో 2 లక్షలే ఉన్నాయి.

News December 19, 2025

నెల్లూరు: కారుణ్య నియామక పత్రాలు అందజేత

image

విధి నిర్వహణలో ఉంటూ మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. జి. భాగ్యమ్మను ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో కుక్ గా, టి. పవన్ ను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో ఆఫీస్ సబార్డినేట్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ భరోసానిచ్చారు.

News December 19, 2025

సూర్యాపేట: ఈనెల 22న జిల్లాలో విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్

image

ప్రజలకు విపత్తు సమయంలో అవసరమైన సేవలు అందించేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. సూర్యాపేటలో ఆయన మాట్లాడారు.జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 22న మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వరదలు, పరిశ్రమ, రహదారి ప్రమాదాల సమయంలో ప్రజలను రక్షించడం,ఉపశమన శిబిరాలు ఏర్పాటు చేయడం,వైద్య, అగ్నిమాపక, పోలీస్ శాఖలు సమన్వయంతో పని చేయడం ముఖ్యమన్నారు.