News November 18, 2025
భూపాలపల్లి: రేపటి నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభం

జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల వద్ద బుధవారం నుంచి సీసీఐ కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు యాజమాన్యాలు ప్రకటించాయి. సీసీఐకి పత్తి విక్రయించాలనుకునే రైతులు వెంటనే స్లాట్ బుకింగ్ చేసుకోవాలని జిల్లా మార్కెట్ అధికారి ప్రవీణ్ రెడ్డి కోరారు. గతంలో ( ఈ నెల 17, 18 తేదీలలో) స్లాట్ బుక్ చేసుకున్నవారు కూడా తిరిగి బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News November 18, 2025
ఆన్లైన్ మోసాలపై తస్మాత్ జాగ్రత్త: ప్రకాశం SP

ఆన్‌లైన్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP హర్షవర్ధన్ రాజు సూచించారు. మంగళవారం ఒంగోలు SP కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నాయని అన్నారు. ఫ్రాడ్ కాల్ స్కామ్ల ద్వారా సైబర్ మోసగాళ్ళు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై హెల్ప్ లైన్ నంబర్ 1930కు సమాచారం ఇవ్వాలని చెప్పారు.
News November 18, 2025
రేపు అకౌంట్లలోకి రూ.7,000.. ఇలా చేయండి

AP: రాష్ట్ర ప్రభుత్వం రేపు రైతుల అకౌంట్లలో రూ.7వేలు జమచేయనుంది. కడప జిల్లాలోని పెండ్లిమర్రిలో జరిగే కార్యక్రమంలో పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కాగా రైతులు ఆన్‌లైన్‌లో <
News November 18, 2025
జడ్చర్ల: అగ్ని ప్రమాదం.. మృతుల వివరాలు ఇవే

జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని సలార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.. వారి వివరాలు పప్పు (ఒడిశా) హరేందర్( బిహార్) అనే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పప్పున్, సాతి మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


