News December 24, 2025

భూపాలపల్లి: రైతు భరోసా కోసం ఎదురుచూపులు

image

భూపాలపల్లి జిల్లాలో యాసంగి పనులు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ ముగుస్తున్నా రైతు భరోసాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. యాసంగిలో 1.25 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. శాటిలైట్ సర్వే ద్వారా సాగులో ఉన్న భూములను గుర్తించి పంటలు పండిస్తున్న వారికి మాత్రమే భరోసా ఇస్తామని మంత్రి ఇటీవల ప్రకటించారు.

Similar News

News December 26, 2025

బయ్యారం: కరెంట్ షాక్‌తో ఉద్యోగి మృతి

image

బయ్యారం మండలంలో విషాదం చోటుచేసుకుంది. కొత్తపేట సబ్ స్టేషన్ పరిధి కాచనపల్లికి చెందిన ఓ రైతు తమ విద్యుత్ మోటారుకు ఫీజులు ఆగడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో విద్యుత్ శాఖ కాంట్రాక్టు ఉద్యోగి ఊకే వెంకటేశ్వర్లు పరీక్షిస్తుండగా కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. ఘటన సబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 26, 2025

NLG: రైతన్నకు ‘యాప్‘ సోపాలు..!

image

జిల్లాలో రైతన్నలకు ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్’తో కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే జిల్లాలో యాసంగిలో 6.57 లక్షల ఎకరాల్లో అధికారులు సాగు అంచనా వేశారు. జిల్లాలో ఎరువులను అందుబాటులో ఉంచాల్సిందిపోయి. ఈ కొత్త యాప్ పనిచేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రారంభించిన తొలిరోజు నుంచి సరిగ్గా పనిచేయకపోవడంతో యాసంగిలో కష్టాలు తప్పేలా లేవనే వాదనలు వినిపిస్తున్నాయి.

News December 26, 2025

SKLM: రథసప్తమి ఉత్సవాలపై ప్రజాభిప్రాయ సేకరణ

image

రథసప్తమి ఉత్సవాలపై ఈనెల 27వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ సభ శనివారం (ఈనెల 27) సాయంత్రం 4 గంటలకు శ్రీకాకుళం నగరంలోని జెడ్పీ మందిరంలో నిర్వహించబడునని పేర్కొన్నారు. ఈ సమావేశానికి ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, ఆలయ సంప్రదాయాలను అవగాహన కలిగిన పెద్దలు హాజరుకావాలని వెల్లడించారు.