News February 2, 2025

భూపాలపల్లి: వాలీ బాల్ ఆడిన ఎమ్మెల్యే గండ్ర

image

భూపాలపల్లి పట్టణంలోని అంబేడ్కర్ స్టేడియంలో వాలీ బాల్ క్లబ్ గెట్ టు గెదర్ కార్యక్రమంలో ఆదివారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని పోటీలను ప్రారంభించారు. అనంతరం కొద్దిసేపు వాలీ బాల్ ఆడి సందడి చేశారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని ఎమ్మెల్యే అన్నారు.  

Similar News

News February 2, 2025

షాద్‌నగర్‌కు పండ్ల మార్కెట్‌ వస్తుందా?

image

షాద్‌నగర్ పట్టణంలో పండ్ల మార్కెట్ లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ మామిడి, సీతాఫలం, జామ తోటలు అత్యధికంగా ఉంటాయి. ఇక్కడ దిగుబడులు వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాయి. కానీ పండ్ల మార్కెట్ లేక రోడ్ల మీదే అమ్మకాలు కొనసాగిస్తూ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అమ్మకాల కోసం పట్టణ శివారులో వేసిన షెడ్ శిథిలమైపోయింది. మామిడి సీజన్ వస్తున్నందున వెంటనే పండ్ల మార్కెట్ నిర్మించాల్సిన అవసరం ఉంది.

News February 2, 2025

రూ.12,500 కోట్లు తిరిగివ్వనున్న రక్షణ శాఖ.. ఎందుకంటే

image

గత ఏడాది బడ్జెట్లో తమకు చేసిన కేటాయింపుల్లో రూ.12,500 కోట్లను రక్షణ శాఖ కేంద్రానికి తిరిగివ్వనుంది. డిఫెన్స్‌ డిపార్ట్‌మెంట్ చేపట్టిన పలు కొనుగోళ్లు వివిధ కారణాలతో జాప్యం కావడంతో వాటి కోసం కేటాయించిన నిధులు మిగిలిపోయాయి. ఆ నిధుల్ని ప్రభుత్వానికి తిరిగిస్తున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రూ.6.81 లక్షల కోట్లను రక్షణ శాఖకు కేంద్రం కేటాయించింది.

News February 2, 2025

చెరువుల రక్షణకై హైడ్రా కమిషనర్‌కు TDF రిపోర్ట్

image

తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో హైడ్రా కమిషనర్ AV రంగనాథ్‌కు MLC ప్రొ. కోదండరాం, TDF​ అధ్యక్షుడు మట్ట రాజేశ్వర్ రెడ్డి చెరువుల రక్షణకు సూచనలతో కూడిన రిపోర్టును అందచేశారు. TGలోని 46,500 చెరువులు, ముఖ్యంగా HYD​తో కలుపుకొని 4 జిల్లాలలోని 1,042 చెరువులకు సంబందించిన డీటేయిల్​ రిపోర్టును అందచేయగా, స్పందించిన హైడ్రా కమిషనర్​ వచ్చే వారం రౌండ్​ టేబుల్​ సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు.