News April 5, 2025
భూపాలపల్లి వాసులూ.. APPLY చేశారా..?

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్‌కమ్ సర్టిఫికెట్స్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేసి హార్డ్ కాపీలను భూపాలపల్లిలోని MPDO ఆఫీస్‌లో ఇవ్వాలి. SHARE
Similar News
News July 9, 2025
బాపట్ల: గుర్తు తెలియని మృతదేహం కలకలం

బాపట్ల మండలం కప్పలవారిపాలెం గ్రామం సమీపంలోని నాగరాజు కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభించింది. బాపట్ల రూరల్ పోలీసులు కథనం మేరకు.. కప్పల వారి పాలెం గ్రామంలోని నాగరాజు కాలువలో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చిందని గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. మృతుడు ఆచూకీ తెలిసినవారు సమాచారం ఇవ్వాలన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News July 9, 2025
కర్నూలు మాజీ ఎంపీకి గోల్డ్ మెడల్

కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్ గోల్డ్ మెడల్ బుధవారం విజయవాడలో అందజేశారు. 17వ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన సమయంలో జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీకి చేసిన సేవలకు గాను ఈ మెడల్ అందజేసి, సన్మానించారు. గవర్నర్‌తో పాటు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.
News July 9, 2025
KNR: లోకల్ ఎన్నికలు.. ఆ పార్టీలు తగ్గేదేలే..!

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ప్రధాన పార్టీల నేతలు దూకుడు పెంచారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలను మచ్చిక చేసుకుంటున్నారు. కాగా నిన్న కాంగ్రెస్ ఉమ్మడి KNR జిల్లా ఇన్‌ఛార్జ్‌గా అద్దంకి దయాకర్‌ను అధిష్ఠానం నియమించగా పార్టీ బలోపేతంపై ఆయన ఫోకస్ చేయనున్నారు. మరోవైపు KTR ఆదేశాలతో ఇప్పటికే BRS నేతలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. BJP సైతం గట్టి పోటీనిచ్చేందుకు వ్యూహాలను రచిస్తోంది.