News January 14, 2026
భూపాలపల్లి: విద్యుత్ తీగల వద్ద గాలిపటాలు ఎగురవేయొద్దు!

విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్న ప్రాంతాల్లో గాలిపటాలు ఎగురవేయవద్దని భూపాలపల్లి జిల్లా విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా చైనా మాంజా వాడకం ప్రమాదకరమని, కాటన్ దారం మాత్రమే వాడాలని సూచించారు. పిల్లల భద్రత దృష్ట్యా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి, విద్యుత్ తీగలు లేని ఖాళీ ప్రదేశాల్లోనే గాలిపటాలు ఎగిరేలా చూడాలన్నారు. ప్రజలందరూ సురక్షితంగా సంక్రాంతి జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.
Similar News
News February 7, 2026
ఈ 2 నెలలు దోమలతో జాగ్రత్త

ఫిబ్రవరి, మార్చి నెలల్లో దోమల బెడద మరింత పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. నవంబర్ నుంచి జనవరి వరకు దోమలు గుడ్లు పెట్టగా ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరిగి వాటి సంఖ్య పెరుగుతోందని తెలిపారు. దోమలు తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో అత్యంత చురుగ్గా ఉంటాయని, గాలిలో తేమ వల్ల కుడతాయని చెప్పారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడటం, కిటికీలు మూయడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News February 7, 2026
కల్వకుర్తి: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన

కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను స్థానిక డీఎస్పీ వెంకటరెడ్డి పరిశీలించారు. సీఐ నాగార్జునతో కలిసి పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 44 పోలింగ్ కేంద్రాలలో 20 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికలను ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
News February 7, 2026
NZB: ‘పోలింగ్ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలి’

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 11న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై ప్రిసైడింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, సమర్థవంతంగా బాధ్యతతో విధులు నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి సూచించారు. శుక్రవారం పీఓలు, ఏపీఓలు, ఓపీఓలకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, ముందుగానే నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు.


