News March 24, 2025
భూపాలపల్లి: వీణవంకలో 16టన్నుల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నుంచి కరీంనగర్ జిల్లా మీదుగా అక్రమంగా తరలిస్తున్న 16టన్నుల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున వీణవంక వద్ద పట్టుకున్నారు. లారీని అనుమానంతో ఆపి తనిఖీ చేయగా, రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని లారీని సీజ్ చేసిన పోలీసులు, దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Similar News
News July 6, 2025
GHMC: అసలు మనకెన్ని ఆస్తులున్నాయి..?

GHMCకి అసలు స్థిరాస్తులు ఎన్ని ఉన్నాయో అధికారులకు అంతుపట్టడం లేదు. దీంతో గ్రేటర్ పరిధిలోని ఆస్తులను సర్వే చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ మేరకు సర్వే చేయడానికి కన్సల్టెంట్లను టెండర్లకు ఆహ్వానించారు. నాలుగు జోన్లలో దాదాపు 1400 స్థిరాస్తులు ఉన్నాయని రికార్డుల్లో ఉంది. ఎక్కడెక్కడ, ఏఏ ఆస్తులు ఉన్నాయో త్వరలో సర్వే చేసి మొత్తం ఆస్తి వివరాలు తెలుసుకోనున్నారు.
News July 6, 2025
సింహాచలం గిరి ప్రదక్షిణ ట్రాఫిక్ రూల్స్

➦అనకాపల్లి నుంచి విజయనగరం వైపు వెళ్లే వాహనాలు విశాఖ సిటీలోకి రాకుండా లంకెలపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి.
➦విజయనగరం నుంచి అనకాపల్లి వైపు వెళ్లే వాహనాలు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి చేరుకోవాలి.
➦ విజయనగరం నుంచి విశాఖ రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్ట్, బస్ స్టేషన్, గాజువాక వైపు వెళ్లే వాహనాలు ఆనందపురం నుంచి పెందుర్తి మీదుగా వెళ్లాలి.
News July 6, 2025
MNJ కేన్సర్ ఆస్పత్రికి 45 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు

MNJ కేన్సర్ ఆస్పత్రిలో ఇక మెరుగైన వైద్య సేవలందనున్నాయి. ఆస్పత్రికి 45 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను కేటాయిస్తూ మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. రోజురోజుకూ కేన్సర్ బాధితులు పెరిగిపోతుండటంతో లక్డీకపూల్(రెడ్ హిల్స్)లో ఉన్న MNJలో పేషెంట్లు చికిత్సకు ఇబ్బందులు ఏర్పడకుండా బోర్డు వీరిని నియమించింది.