News April 15, 2025

భూపాలపల్లి: వేసవి సెలవులు.. ఓ కన్నేసి ఉంచండి!

image

ఈనెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. అయితే సెలవుల్లో పిల్లలు చెరువులు, బావుల్లో ఈతకు వెళ్లకుండా చూడాలని తల్లితండ్రులకు అధికారులు సూచిస్తున్నారు. వారిపై ఓ కన్నేసి ఉంచాలని చెబుతున్నారు. స్నేహితులతో దూర ప్రాంతాలకు పంపవద్దని, బైకులు ఇవ్వొద్దని, ఫోన్ వాడకుండా చూడాలని అంటున్నారు. కాగా, BHPL జిల్లాలో సెలవుల్లో ప్రమాదాల బారినపడి పిల్లలు మరణించిన సందర్భాలూ ఉన్నాయి.

Similar News

News February 8, 2026

నేడు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కేటీఆర్

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార సభలకు రానున్నారు. ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్ నార్సింగి నివాసం నుంచి బయల్దేరి, గోపన్నపల్లి హెలిప్యాడ్ ద్వారా తాండూర్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రచారం అనంతరం నర్సంపేట, మహబూబాబాద్ మున్సిపాలిటీల్లో పాల్గొని, సాయంత్రం 4 గంటలకు వర్ధన్నపేటలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు.

News February 8, 2026

ఖమ్మం: ‘పసుపు’ జెండా.. ఎవరికి అండా?

image

మున్సిపల్ ఎన్నికల వేళ ఉమ్మడి ఖమ్మంలో “టీడీపీ ఎటు?” అనే చర్చ హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్రచారంలో ఎటు చూసినా పసుపు జెండాలు కనిపిస్తుండటం విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తోంది. హస్తం సభల్లో ఒక వర్గం, కారు ర్యాలీల్లో మరో వర్గం సందడి చేస్తుండటంతో.. ‘తమ్ముళ్ల’ అసలు వ్యూహం ఏంటో అర్థం కాక ఓటర్లు అయోమయంలో పడ్డారు. ఈ ‘పసుపు’ మద్దతు అంతిమంగా ఎవరి గెలుపును మారుస్తుందో వేచి చూడాలి.

News February 8, 2026

ఖమ్మం: వలస ఓటర్లకు ‘డిజిటల్‌’ ఎర!

image

ఉమ్మడి ఖమ్మలో మున్సిపల్ ఎన్నికల వేళ అభ్యర్థులు వలస ఓటర్లపై కన్నేశారు. హైదరాబాద్‌‌లో ఉంటున్న వారిని రప్పించేందుకు ‘ఆఫర్ల’ వర్షం కురిపిస్తున్నారు. ప్రయాణ ఖర్చులతో పాటు, ‘ఫోన్‌పే’ ద్వారా నగదు, విందు భోజనాల ఎర చూపుతున్నారు. కొత్తగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి, మధిర ప్రాంతాల్లోని వివరాలు సేకరించి ఈ గాలం వేస్తున్నారు. దీంతో ఓటు వేసేందుకు వలస ఓటర్లు కూడా స్వగ్రామాలకు వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారు.