News February 26, 2025
భూపాలపల్లి: శివరాత్రి ఉత్సవాలకు భారీగా పోలీసులు

మహాశివరాత్రి ఉత్సవాలకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు భూపాలపల్లి జిల్లా కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరంలో పోలీసులతో సమావేశమై మాట్లాడుతూ ఒక ఏఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 208 మంది కానిస్టేబుల్స్ ఉన్నట్లు తెలిపారు. మూడు చోట్లలో భక్తులకు ప్రత్యేక సేవలు అందించనున్నట్లు తెలిపారు.
Similar News
News February 26, 2025
రామప్ప శివపార్వతుల కళ్యాణానికి మంత్రి సీతక్క

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి సీతక్క మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ములుగులోని రామప్పలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క పట్టు వస్త్రాలు అందించనున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించి, అనంతరం పలు దేవాలయాల్లో జరిగే శివపార్వతుల కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు హాజరుకావాలని కోరారు.
News February 26, 2025
10 రోజుల్లో పెళ్లి.. మహిళా కానిస్టేబుల్ సూసైడ్

భువనగిరిలో మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. కుటుంబసబ్యులు ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అనూషకు ఈ నెల 14న నిశ్చితార్థం జరగ్గా, వచ్చే నెల 6న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు.ఈ క్రమంలో అనూష తను అద్దెకు ఉంటున్న ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని సహోద్యోగులకు చెప్పినట్లు తెలుస్తోంది.
News February 26, 2025
భువనగిరి: 10 రోజుల్లో పెళ్లి.. మహిళా కానిస్టేబుల్ సూసైడ్

భువనగిరిలో మహిళా కానిస్టేబుల్ <<15576453>>బలవన్మరణానికి<<>> పాల్పడిన విషయం తెలిసిందే. కుటుంబసబ్యులు ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అనూషకు ఈ నెల 14న నిశ్చితార్థం జరగ్గా, వచ్చే నెల 6న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు.ఈ క్రమంలో అనూష తను అద్దెకు ఉంటున్న ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని సహోద్యోగులకు చెప్పినట్లు తెలుస్తోంది.