News November 3, 2025
భూపాలపల్లి: షాపు నంబర్ 49, 50లకు ఓపెన్ డ్రా

గత నెల 27న నిర్వహించిన మద్యం దుకాణాల డ్రాలో నిలిచిపోయిన రెండు షాపులకు ఓపెన్ టెండర్ ప్రక్రియలో భాగంగా డ్రా నిర్వహించారు. సోమవారం భూపాలపల్లి కలెక్టర్ ఛాంబర్‌లో కలెక్టర్ రాహుల్ శర్మ షాపు నంబర్లు 49, 50లకు డ్రా తీశారు. షాపు నంబర్ 49 (చల్వాయి) కోసం 23 దరఖాస్తులు రాగా, అది సదర్ లాల్ అనే వ్యక్తికి దక్కింది. అదే విధంగా, షాపు నంబర్ 50 సమ్మక్క అనే మహిళకు దక్కినట్లు అధికారులు ప్రకటించారు.
Similar News
News November 4, 2025
TU: సత్ఫలితాలనిస్తున్న బయోమెట్రిక్ హాజరు

తెలంగాణ యూనివర్సీటీలో ఇటీవల పకడ్బందీగా చేపట్టిన బయోమెట్రిక్ హాజరు విధానం సత్ఫలితాలనిస్తోంది. ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్న వర్సిటీ అధికారులు ఎవరినీ ఉపేక్షించడం లేదు. తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం సమయానుసారంగా బయోమెట్రిక్ ఇవ్వాల్సిందేనని, నిబంధనలు పాటించని అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది జీతాల్లో కోతలు విధిస్తోంది. బయోమెట్రిక్ హాజరు లేని సిబ్బంది సాధారణ సెలవులను భారీగా కోత విధించింది.
News November 4, 2025
షెఫాలీ బౌలింగ్ మాకు బిగ్ సర్‌ప్రైజ్: లారా

తాము వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడానికి షెఫాలీ వర్మ బౌలింగ్ కూడా కారణమని SA కెప్టెన్ లారా ఒప్పుకున్నారు. ‘షెఫాలీ బౌలింగ్ మాకు బిగ్ సర్‌ప్రైజ్. WC పైనల్‌లాంటి మ్యాచుల్లో పార్ట్‌టైమ్ బౌలర్లకు వికెట్లు కోల్పోవడం కరెక్ట్ కాదు. ఆమె బంతిని నెమ్మదిగా సంధిస్తూనే రెండు వికెట్లు తీసుకుంది. ఇంక ఆమెకు వికెట్స్ ఇవ్వకూడదు అనుకుంటూ మిస్టేక్స్ చేశాం. భారత్ నిర్ణయం మమ్మల్ని ఆశ్చర్య పరిచింది’ అని లారా తెలిపారు.
News November 4, 2025
సంగారెడ్డి: కానిస్టేబుల్ ఆత్మహత్యకు కారణం ఇదే.!

ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం కారణంగా లక్షల రూపాయలు నష్టపోవడంతో కానిస్టేబుల్ సందీప్ మహబూబ్‌సాగర్ చెరువు కట్టపై ఆత్మహత్య చేసుకున్నారు. 2024 బ్యాచ్‌కు చెందిన సందీప్ గతంలో శిక్షణ సమయంలోనూ గేమింగ్ వ్యసనంతో ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. యువత ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిస కావద్దని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు.


