News February 4, 2025

భూపాలపల్లి: సింగరేణి ఉద్యోగులకు శుభవార్త

image

2024- 25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించేందుకు ఉద్యోగులకు స్పెషల్ ఇన్సెంటివ్‌ను ప్రవేశపెడుతూ సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి జనవరి వరకు 53.73 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. ఫిబ్రవరి, మార్చిలో మిగతా 18.27 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధనకు ఉద్యోగులకు స్పెషల్ ఇన్సెంటివ్ అందించనున్నారు.

Similar News

News November 6, 2025

పెద్దపల్లి: కాల్వ శ్రీరాంపూర్‌లో యువకుడి ఆత్మహత్య

image

కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన నీరటి రాజు (31) గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మద్యం అలవాటు కారణంగా కుటుంబ కలహాలు చోటుచేసుకున్నాయని, బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన రాజు గురువారం ఉదయం తిరిగొచ్చి ఇంట్లో ఉరివేసుకున్నట్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.

News November 6, 2025

NZB: కిషోర బాలికల సంఘాలను ఏర్పాటు చేయండి: DRDO

image

జిల్లాల్లో కిషోర బాలికల సంఘాలను ఏర్పాటు చేయాలని NZB DRDO సాయాగౌడ్ ఆదేశించారు. గురువారం NZB కలెక్టరేట్‌లో NZB, KMR, ADB, MDK, నిర్మల్ జిల్లాల DPM, DAPMలకు హెల్త్ అండ్ న్యూట్రీషియన్, బాలికల సంఘాల ఏర్పాటు అంశాల్లో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడారు.. కిశోర బాలికల సంఘాలను ఏర్పాటు చేసి వారికి మండల, గ్రామ స్థాయిలో అంగన్వాడీ టీచర్స్, ANMలతో సమన్వయం చేయాలని సూచించారు.

News November 6, 2025

ప్రతి విద్యార్థి వివరాలను యూడైస్‌లో నమోదు చేయాలి: NZB కలెక్టర్

image

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని ప్రతి విద్యార్థికి సంబంధించిన వివరాలను యూడైస్‌లో నమోదు చేయాలని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. నిజామాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో గురువారం విద్యా శాఖ అధికారులు, కళాశాలల ప్రిన్సిపల్స్, HMలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ప్రయోజనార్థం ప్రభుత్వం వారి వివరాలను యూడైస్‌లో నిక్షిప్తం చేయిస్తోందన్నారు.