News April 11, 2025
భూపాలపల్లి: సెల్ ఫోన్ సిగ్నల్ రావాలంటే చెట్లు ఎక్కాల్సిందే!

మహాముత్తారం మం.లోని యత్నారంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. సిగ్నల్ రావాలంటే ఎత్తైన ప్రదేశం లేదా చెట్లైనా ఎక్కాలి. లేదా ట్రాక్టర్ ట్రాలీపై నిల్చొని మాట్లాడాల్సి వస్తుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామంలో సెల్ టవర్ నిర్మించాలని, లేదా సమీప టవర్ సిగ్నల్ పరిధినైనా పెంచాలని కోరుతున్నారు. మీ ప్రాంతంలో సిగ్నల్ ఎలాఉందో కామెంట్ చేయండి.
Similar News
News January 8, 2026
KNR: సంక్రాంతి స్పెషల్.. HYD నుంచి కాగజ్‌నగర్‌కు ప్రత్యేక రైలు

సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్-కాగజ్‌నగర్ మార్గంలో ఈనెల 9, 10, 18 తేదీల్లో ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రైలు ఉదయం 7:55కు హైదరాబాద్‌లో బయలుదేరి మధ్యాహ్నం కాగజ్‌నగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల తేదీల్లో మధ్యాహ్నం 3:15కు కాగజ్‌నగర్‌లో బయలుదేరుతుంది. ఉమ్మడి జిల్లాలోని ఉప్పల్, జమ్మికుంట, ఓదెల, పెద్దపల్లి, రామగుండం స్టేషన్‌లలో రైలు ఆగుతుంది.
News January 8, 2026
సోదరికి గుడి కట్టి దేవతలా కొలుస్తున్నాడు!

AP: నెల్లూరు జిల్లా వెంకటాచలంలో అపురూపమైన సోదర బంధం వెల్లివిరిసింది. 14 ఏళ్ల క్రితం ప్రమాదంలో మరణించిన అటవీ శాఖాధికారి సుబ్బలక్ష్మి జ్ఞాపకార్థం ఆమె సోదరుడు ఏకంగా ఓ ఆలయాన్ని నిర్మించారు. ఆమెను దేవతగా కొలుస్తూ గత 14 ఏళ్లుగా నిత్య పూజలు, ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మరణం తన సోదరిని భౌతికంగా దూరం చేసినా గుడి కట్టి ఆరాధిస్తున్న ఆ సోదరుడిపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి.
News January 8, 2026
ఇండస్ట్రీయల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

ఇండస్ట్రీయల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (<


