News December 18, 2025
భూపాలపల్లి: 23 ఏళ్లకే సర్పంచ్

జిల్లాలోని కాటారం మండలం గుమ్మలపల్లి సర్పంచ్‌గా 23 ఏళ్ల భక్తు శరత్ కుమార్ ఎన్నికై రికార్డు సృష్టించారు. ప్రస్తుతం మహదేవపూర్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న శరత్, పిన్న వయస్కుడైన సర్పంచిగా గుర్తింపు పొందారు. రాజకీయాల ద్వారా గ్రామాభివృద్ధికి పాటుపడాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగానని శరత్ తెలిపారు. యువత రాజకీయాల్లోకి వచ్చి గ్రామాల రూపురేఖలు మార్చాలని ఆయన ఆకాంక్షించారు.
Similar News
News December 19, 2025
ప్రతి నెలా BRSకు రూ.5వేలు.. మేం పార్టీ మారలేదు: ఎమ్మెల్యేలు

TG: పార్టీ ఫిరాయింపు అంశంపై పలువురికి క్లీన్ చిట్ ఇస్తూ స్పీకర్ ప్రసాద్ ఇచ్చిన ఆర్డర్ కాపీలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతినెలా తమ జీతం నుంచి BRS LPకి ₹5వేలు చెల్లిస్తున్నామని మహిపాల్, కాలె యాదయ్య, ప్రకాశ్ గౌడ్ స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో BRSకు డబ్బులిస్తున్నప్పుడు పార్టీ మారినట్లు భావించలేమని స్పీకర్ వెల్లడించారు. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు అఫిడవిట్ కాపీలో పొందుపరిచారు.
News December 19, 2025
రాజంపేటలో CM హామీ ఇచ్చిన చోటే..!

రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేస్తామని హామీ ఇచ్చిన చోటే శుక్రవారం ప్రజాగర్జన నిర్వహించడానికి జేఏసీ రంగం సిద్ధం చేసింది. జిల్లా కేంద్రం విషయంలో రాజంపేటకు అన్యాయం జరిగిందని, తాము న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అదే ప్రాంతంలో నిర్వహించనున్న గర్జన సభకు కోడూరు, రాజంపేట నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున ప్రజలు, నేతలు తరలి రానున్నారు.
News December 19, 2025
నాగర్‌కర్నూల్ జిల్లా అటవీశాఖ అధికారిగా రేవంత్ చంద్ర

నాగర్‌కర్నూల్ జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్‌ఓ)గా రేవంత్ చంద్ర శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన రోహిత్ గోపిడి రంగారెడ్డి జిల్లాకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో రేవంత్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అడవుల సంరక్షణతో పాటు వన్యప్రాణుల రక్షణకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తానని, బాధ్యతయుతంగా విధులను నిర్వహిస్తానని పేర్కొన్నారు.


