News December 15, 2025

భూపాలపల్లి: 73 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు!

image

గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరు అయిన 73 మంది పోలింగ్ అధికారులు (పీవో), అసిస్టెంట్ పోలింగ్ అధికారులకు (ఏపీవో) భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎన్నికల విధులకు హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. గడువు లోపు సరైన వివరణ ఇవ్వకుంటే ఎన్నికల నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News December 16, 2025

‘గత ఐదేళ్లలో ఏపీకి రూ.112.67 కోట్లు మాత్రమే విడుదల’

image

దీనదయాళ్ దివ్యాంగజన పునరావాస పథకం (DDRS) కింద ఆంధ్రప్రదేశ్‌కు గత ఐదేళ్లలో రూ.112.67 కోట్ల నిధులు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి బి.ఎల్.వర్మ తెలిపారు. 241 స్వచ్ఛంద సంస్థల ద్వారా 25,534 మంది దివ్యాంగులు లబ్ధి పొందారని చెప్పారు. లోక్‌సభలో ఎంపీ కేశినేని శివనాథ్ ప్రశ్నకు సమాధానంగా, దివ్యాంగుల పునరావాసం, విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం ఈ పథకం కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

News December 16, 2025

పాడేరు: ‘మ్యూటేషన్ల ప్రక్రియలో అలసత్వం చేయకుండా చూడాలి’

image

జిల్లాలో రెవిన్యూ రీసర్వే, మ్యూటేషన్ ప్రక్రియలో అలసత్వం చేయకుండా చూడాలని ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. మరలా గ్రామ సభలు నిర్వహించే నాటికి రీసర్వే పూర్తి చేయాలన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో వీసీ నిర్వహించారు. రీ సర్వే చేసినప్పుడు ప్రభుత్వ భూములు, డీ పట్టా ల్యాండ్స్ పూర్తిగా పరిశీలించి, వెబ్ ల్యాండ్ సబ్ డివిజన్ చేయాలన్నారు.

News December 16, 2025

కామారెడ్డి: మూడో విడతలో 462 మంది సర్పంచ్ అభ్యర్థులు

image

కామారెడ్డి మూడో విడత ఎన్నికల్లో భాగంగా 142 గ్రామపంచాయతీ స్థానాలకు రేపు బుదవారం జరగనున్న ఎన్నికల్లో 462 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే 1,020 వార్డులకు గాను 2,790 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ఎవరిని అదృష్టం వరిస్తుందో రేపటి వరకు వేచి చూడాలి.