News February 25, 2025
భూపాలపల్లి: 8న జాతీయ లోక్ అదాలత్

మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ లోక్ అదాలత్‌లో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారం కోసం కృషి చేయాలని, సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకుంటే కలిగే లాభాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.
Similar News
News February 25, 2025
ఖమ్మం: మార్కెట్‌కు పోటెత్తిన మిర్చి

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం మిర్చి పోటెత్తింది. ఏకంగా 1.20 లక్షల బస్తాల మిర్చి వచ్చింది. బుధవారం నుంచి ఆదివారం వరకు శివరాత్రి సెలవులు ఉండటం.. మంగళవారం ఒక్క రోజే మార్కెట్ ఓపెన్ ఉండటంతో రైతులు పెద్ద ఎత్తున తీసుకువచ్చారు. ఉమ్మడి ఖమ్మం నుంచే కాక నల్గొండ, మహబూబాబాద్, ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి తీసుకువస్తున్నారు. క్వింటాకు ధర రూ.14,125 పలికింది.
News February 25, 2025
రైలు కిందపడి కాసిపేట యువకుడి సూసైడ్

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలానికి చెందిన యువకుడు రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన క్రాంతి(29) ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, వివాహం కావడం లేదని మనస్తాపానికి గురై కల్వరి చర్చి వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. రైల్వే ఎస్ఐ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
News February 25, 2025
వరంగల్: క్వింటా పత్తి ధర రూ.6900

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర రూ.10 పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,890 ధర పలకగా.. నేడు రూ.6900 అయినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆశించిన స్థాయిలో ధర రావడం లేదని రైతులు నిరాశ చెందుతున్నారు. ధరలు పెరిగేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.