News November 22, 2025

భూపాలపల్లి DCC అధ్యక్షుడిగా భట్టు కర్ణాకర్

image

భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా భట్టు కర్ణాకర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థి నాయకుడిగా ఎదిగి కాంగ్రెస్ యూత్ జిల్లా అధ్యక్షుడిగా చేసిన కర్ణాకర్‌కు అధిష్ఠానం జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చింది.

Similar News

News November 23, 2025

సీమ అభివృద్ధికి సత్య సాయిబాబా కృషి: కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఆదివారం నిర్వహించారు. వేడుకల్లో కర్నూలు ఎంపీ నాగరాజు, కలెక్టర్ డా.ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. సత్య సాయిబాబా రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు.

News November 23, 2025

విత్తనాలు కొంటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

మంచి నాణ్యత, మొలకెత్తే శక్తి అధికంగా కలిగిన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. విత్తనాలను లైసెన్స్ కలిగిన అధీకృత డీలర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. సరైన సీలుతో మరియు ధ్రువీకరణ పత్రంతో ఉన్న విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకొని కొనుగోలు చేయాలి. విత్తన రకం, లాట్ నంబర్, గడువు తేదీ తదితర వివరాలను సరిచూసుకొని విత్తనాలను కొనుగోలు చేయాలి. కొనుగోలు రశీదు తప్పక తీసుకోవాలి. దీనిపై రైతు, డీలర్ సంతకం తప్పక ఉండాలి.

News November 23, 2025

VZM: అక్కడ చురుగ్గా పనులు.. ఇక్కడ మాత్రం..!

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో బ్రిటిష్ కాలంనాటి వంతెనలు చాలా ఉన్నాయి. వాటిలో సీతానగరం, పారాది, కోటిపాం ప్రధానమైనవి. అంతర్రాష్ట్ర రహదారిపై ఉన్న ఈ వంతెనలపై నుంచి రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. అయితే వాహనాల రద్దీ పెరగడంతో వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో పారాది, సీతానగరం వద్ద కొత్త వంతెనల పనులు చురుగ్గా సాగుతున్నప్పటికీ కోటిపాం వంతెన పనులకు అడుగులు పడకపోవడం గమనార్హం.