News October 21, 2025

భూభారతి’ దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలి: కలెక్టర్

image

వలిగొండ మండలంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. భూ సమస్యల సంబంధిత దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించాలని ఆదేశించారు. కుల,ఆదాయ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల దరఖాస్తులను పెండింగ్‌లో లేకుండా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ దశరథ, ఎంపీడీఓ జలంధర్ రెడ్డి పాల్గొన్నారు.

Similar News

News October 22, 2025

అన్నమయ్య: భారీ వర్షాలతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్‌‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అత్యవసర సమయంలో కంట్రోల్ రూమ్ నంబర్ 08561- 293006కు కాల్ చేయాలన్నారు. కంట్రోల్ రూమ్ 24 గంటలు అందుబాటులో ఉండేలా సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. సహాయ చర్యల కోసం కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని మంత్రి పేర్కొన్నారు.

News October 22, 2025

SRD: అత్యధిక గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించిన శివాలి

image

రుద్రారం గీతం విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రీ శ్రీవాస్తవ మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఓరిగామి ప్రదర్శనను నిర్వహించి, తల్లిదండ్రులు కవితా జోహ్రీ శ్రీవాస్తవతో కలిసి రెండు కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించారు. ఈ విజయంతో ఆమె మొత్తం 21 గిన్నిస్ రికార్డులను సాధించి, భారతదేశంలో అత్యధిక గిన్నిస్ రికార్డులు కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

News October 22, 2025

తిరుపతి జిల్లాలో నేడు స్కూళ్లకు సెలవు

image

తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ బుధవారం సెలవు ప్రకటించారు. ఈ సమాచారాన్ని వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేయాలని డీఈవోని ఆదేశించారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.