News October 8, 2025
భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి ద్వారా రైతులు సకాలంలో తమ భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేలా చొరవ చూపాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటనే ఆర్జీలను పరిష్కరించాలని ఆమె స్పష్టం చేశారు. నర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో భూభారతి అమలుపై ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.
Similar News
News October 8, 2025
ప్రభుత్వ కళాశాలల్లో వంద శాతం ఎఫ్ఆర్ఎస్ నమోదు: డీఐఈఓ

వరంగల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు(రిజిస్ట్రేషన్) వంద శాతం పూర్తి చేసినట్లు DIEO శ్రీధర్ సుమన్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1191 ప్రథమ సం., 959 ద్వితీయ సం. మొత్తం 2,150 మందికి గాను 2150 మంది విద్యార్థులు, 187 మంది సిబ్బంది పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు తెలిపారు. ముఖ గుర్తింపు హాజరు రిజిస్ట్రేషన్‌లో వరంగల్ జిల్లా ముందంజలో ఉందన్నారు.
News October 8, 2025
NSPT: పారా మెడికల్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ పారా మెడికల్ కళాశాలలో రెండు కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. ఈసీజీ డిప్లొమాలో 30 సీట్లు, డిప్లొమా డయాలసిస్‌లో 30 సీట్లు ఉన్నట్లు చెప్పారు. ఈ నెల 28 వరకు నర్సంపేట మెడికల్ కాలేజీలో దరఖాస్తులను చేసుకోవచ్చని పేర్కొన్నారు.
News October 7, 2025
వరంగల్: ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ సత్య శారద మంగళవారం ఎనుమాముల మార్కెట్ యార్డులో పరిశీలించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్ హాళ్లు, స్ట్రాంగ్ రూమ్‌లు, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, నీటి, టాయిలెట్ సౌకర్యాలను పరిశీలించారు. కౌంటింగ్ హాళ్లలో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.