News April 21, 2025
భూభారతి పోర్టల్‌పై అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

నేరేడుచర్లలోని సోమవారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూభారతి అవగాహన సదస్సు నిర్వహించారు. భూభారతి పోర్టల్‌పై రైతులు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ తేజస్ నందలాల్ అన్నారు. ఈ పోర్టల్లో పది మాడ్యూల్స్, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్ఎఆర్ కరెక్షన్, నాలా, అప్పీల్, భూముల వివరాలు, భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ పొందుపరిచారని తెలిపారు.
Similar News
News April 21, 2025
ఇండియాలో 83% పన్నీర్ కల్తీనే.. ఇలా చెక్ చేయండి!

శాకాహార ప్రియులకు ఎంతో ఇష్టమైన ‘పన్నీర్’ ఇప్పుడు భారతదేశంలో అత్యంత కల్తీ ఆహార ఉత్పత్తిగా మారింది. ప్రస్తుతం 83% పన్నీర్ కల్తీ అని, అందులో 40శాతం వాటిని ఏ జంతువు తినకూడదని తాజా నివేదికలో వెల్లడైంది. ఈ క్రమంలో కల్తీ పన్నీర్‌ను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. ఉడకబెట్టిన పన్నీర్‌పై రెండు చుక్కల అయోడిన్ డ్రాప్స్ వేయాలి. నీలి రంగులోకి మారితే అది ఫేక్. ఒరిజినల్‌ది తెలుపు లేదా లైట్ ఆరెంజ్‌లోకి మారుతుంది.
News April 21, 2025
మెడికల్ డ్రగ్స్ తీసుకొని ఇంటర్ విద్యార్థి మృతి

TG: హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో మత్తు కోసం మెడికల్ డ్రగ్స్ తీసుకొని ఇంటర్ విద్యార్థి మరణించాడు. సాహిల్ అనే వ్యక్తి నుంచి ముగ్గురు విద్యార్థులు మెడికల్ డ్రగ్స్ కొనుగోలు చేశారు. ఇంజక్షన్‌తో పాటు టాబ్లెట్లను ఒకే సమయంలో తీసుకోగా ఓ విద్యార్థి అక్కడికక్కడే చనిపోయాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రగ్స్ అమ్మిన సాహిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
News April 21, 2025
ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీసులో ప్రజా గ్రీవెన్స్

ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్) కార్యక్రమం సోమవారం జరిగింది. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గ్రీవెన్స్ వచ్చిన ప్రజా సమస్యలను తెలుసుకొని వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ శ్రీనివాసరాజు, వేణు సూర్య, డిఎల్పిఓ నూర్జహాన్, డిఎల్డిఓ రమణ రెడ్డి పాల్గొన్నారు.