News August 12, 2025
భూభారతి సమస్యలు పరిష్కరించండి: కలెక్టర్

పాపన్నపేట తహసీల్దార్ కార్యాలయంను మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం సందర్శించారు. భూభారతి దరఖాస్తులను పరిశీలించారు. ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో తదితర వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తగు సూచనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నమూనా భవనాన్ని పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తహశీల్దార్ సతీష్ కుమార్ తదితరులు ఉన్నారు.
Similar News
News September 8, 2025
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి దామోదర్

గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి సి.దామోదర్ రాజనర్సింహ అన్నారు. సోమవారం మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో పర్యటనకు రాగా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్డీఓ రమాదేవి స్వాగతం పలికారు. బీటీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. స్థానిక నాయకులు రమేష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
News September 8, 2025
మెదక్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం ఆందోళనలు

మెదక్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం ఆందోళనలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం
చేగుంటలో యూరియా కోసం కోసం రైతులు రోడ్డు ఎక్కారు. గాంధీ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. రామయంపేట పీఏసీఎస్ వద్ద క్యూ లైన్ లో రైతులు చెప్పులు పెట్టారు. శివ్వంపేట ప్రాథమిక సహకార సంఘం ముందు, నర్సాపూర్ రోడ్డుపై రైతులు ధర్నాకు దిగడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
News September 8, 2025
చేగుంట: చెట్టును ఢీకొట్టిన కారు.. యువకుడు మృతి

చేగుంట మండలం అనంతసాగర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేగుంట నుంచి బోనాల వైపు వెళ్తున్న ఒక కారు అతివేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రామాయంపేట మండలం శివాయపల్లికి చెందిన సాయితేజ్ (23) మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.