News August 22, 2025

భూమన బెదిరింపులకు భయపడం: పూతలపట్టు ఎమ్మెల్యే

image

వైసీపీ నేత భూమన బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఆయన మాట్లాడారు. టీటీడీని వైసీపీ తన రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ఛైర్మన్ బీఆర్ నాయుడుపై భూమన చేసిన ఆరోపణలను ఖండించారు. వైసీపీ హయాంలో ఎన్నో అరాచకాలు చోటు చేసుకున్నాయని ఆయన అన్నారు.

Similar News

News August 21, 2025

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు ప్రముఖులకు ఆహ్వానం

image

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి 2025 వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం ఈ.వో పెంచల కిశోర్ జిల్లాలోని ప్రముఖులకు ఆహ్వాన పత్రిక అందించారు. వారిలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణాసారిక, ఎస్పీ మణికంఠ చందోలు, JC విద్యాధరి ఇతర ముఖ్య అధికారులు ఉన్నారు. వారికి ఈవో ఆహ్వాన పత్రికలు అందజేసి బ్రహ్మోత్సవాలకు రావాలంటూ కోరారు.

News August 21, 2025

ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు: చిత్తూరు SP

image

వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతుల పొందేందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని ఎస్పీ మణికంఠ గురువారం స్పష్టం చేశారు. మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో క్లియరెన్స్ విధానం తీసుకొచ్చామన్నారు. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తే సరిపోతుందన్నారు. మైక్ అనుమతులను మీసేవ కేంద్రాలలో పొందాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.

News August 21, 2025

సోషల్ మీడియాకు దూరంగా ఉండండి: కలెక్టర్

image

విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. సావిత్రమ్మ డిగ్రీ కళాశాలలో హాస్టల్ నిర్మాణానికి ఆయన గురువారం భూమిపూజ చేశారు. తల్లితండ్రుల కలను నెరవేర్చడమే విద్యార్థుల లక్ష్యమన్నారు. ఓ టార్గెట్ పెట్టుకుని దానిని సాధించడానికి కృషి చేయాలని సూచించారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ.. విద్యపై చేసే ఖర్చు ఎప్పటికీ వృథా కాదన్నారు.