News June 12, 2024

భూమా అఖిల ప్రియకు నిరాశ

image

ఆళ్లగడ్డ నుంచి గెలుపొంది భూమా అఖిల ప్రియకు నిరాశ ఎదురైంది. తల్లి శోభా నాగిరెడ్డి మరణంతో రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆమె.. 2014 ఉప ఎన్నికలో YCP తరఫున MLAగా ఏకగ్రీవమయ్యారు. 2016లో TDPలో చేరి చంద్రబాబు మంత్రివర్గంలో పర్యాటక, తెలుగు భాష, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2019లో ఓటమి చెందినా ఈ ఎన్నికల్లో మళ్లీ గెలుపొందారు. మరోసారి మంత్రి పదవి వస్తుందని భావించినా చివరికి నిరాశ ఎదురైంది.

Similar News

News November 15, 2025

బాల్య వివాహాలను నిర్మూలించండి: కలెక్టర్

image

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. శనివారం కర్నూలు కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో వరకట్న నిషేధం, బాల్య వివాహాల నిర్మూలనకు సంబంధించి జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో వరకట్న నిషేధంపై అధికారులు స్వచ్ఛంద సంస్థల ద్వారా నిరంతరం అవగాహన కల్పించాలన్నారు.

News November 15, 2025

సమాజ పరిశుభద్రత ఎంతో అవసరం: కలెక్టర్

image

ప్రస్తుత సమాజంలో పరిశుభ్రత పాటించే విధంగా ప్రతి ఒకరు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పిలుపునిచ్చారు. శనివారం ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ పంచాయతీలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘వ్యక్తిగత, సమాజ పరిశుభద్రత”’ ర్యాలీని కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.

News November 15, 2025

పాఠశాలల్లో డ్రాపౌట్లు ఉండకూడదు: కలెక్టర్ సిరి

image

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు డ్రాపౌట్లు కాకుండా చూడాలని, పిల్లలను వలసలకు తీసుకెళ్లే తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి విద్యా శాఖాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో డీఈఓ, ఎంఈఓలతో నిర్వహించిన సమీక్షలో ఆమె ఈ ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమ ప్రాంతంలో ఈ సమస్యపై దృష్టి సారించాలని సూచించారు.