News December 11, 2024
భూమా దంపతులు ఉంటే ఇలా మాట్లాడేవారా?: మంచు మనోజ్

భూమా మౌనికకు తల్లిదండ్రులు ఉంటే తన తండ్రి ఇలా ప్రవర్తించే వారా? అని మంచు మనోజ్ ప్రశ్నించారు. ‘భూమా మౌనికను ప్రేమించా. పెళ్లి చేసుకున్నా. అందులో తప్పేముంది. నా భార్య వచ్చాక చెడ్డోడిని అయ్యానంటున్నారు. తాగుడికి బానిసయ్యానని మాట్లాడుతున్నారు. మౌనికకు తల్లిదండ్రులు ఉంటే ఇలా మాట్లాడేవారా. ఇప్పుడు ఆమెకు తల్లీ, తండ్రి అన్నీ నేనే. నా భార్య కష్టపడే వ్యక్తి. నిజాలు తర్వలో తెలుస్తాయి’ అని చెప్పారు.
Similar News
News November 5, 2025
ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో ముమ్మర తనిఖీలు

ఇటీవల జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో రాత్రి పూట నడిచే ప్రైవేట్, ఆర్టీసీ ట్రావెల్స్ బస్సుల్లో భద్రతా ప్రమాణాల అమలుపై ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. వాహన పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు, భద్రతా పరికరాలు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
News November 5, 2025
ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు త్వరగా పరిష్కరిస్తాం: కలెక్టర్

కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, మెడికల్ కాలేజీ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. బుధవారం సాయంత్రం మెడికల్ కాలేజీ సమావేశ మందిరంలో అన్ని వైద్య విభాగాల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. వైద్య పరికరాలు, సిబ్బంది నియామకాలు, వసతుల మెరుగుదల కోసం చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి టీజీ భరత్ సహకారంతో సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.
News November 5, 2025
కర్నూలు జిల్లాలో SIల బదిలీలు: SP

కర్నూలు జిల్లాలో SIల బదిలీలు చేపట్టినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మంగళవారం బదిలీల ఉత్తర్వులు జారీ చేశారు. గూడూరు SI అశోక్‌ను కర్నూలు తాలూకా PSకు, SI ఎం.తిమ్మయ్యను కర్నూలు 3 టౌన్ నుంచి కర్నూలు 2 టౌన్‌కు, SI జి.హనుమంత రెడ్డిని 2 టౌన్ నుంచి గూడూరుకు, SI ఏసీ పీరయ్యను కర్నూలు తాలూకా PS నుంచి కర్నూలు 3 టౌన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


