News February 14, 2025
భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి: కలెక్టర్

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ అధికారులు తగిన జాగ్రత్తలు వహించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం అయ్యారు. ప్రజల నుంచి వచ్చే వినతులకు సకాలంలో సమాధానం చెప్పాలన్నారు. సమస్యలను నిర్ణీత గడువులో పరిస్కరించాలని సూచించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువల అన్యాక్రాంతాన్ని అవ్వకుండా చర్యలు చేపట్టాలన్నారు.
Similar News
News March 12, 2025
విశాఖలో రూ.100కు చేరిన నిమ్మ..!

విశాఖ 13 రైతు బజార్‌లో బుధవారం నాటి కూరగాయ ధరలను అధికారులు ఈ విధంగా నిర్ణయించారు. (KG/రూలలో) టమాటా రూ.16, ఉల్లి రూ.23, బంగాళదుంపలు రూ.16, దొండకాయలు రూ.38, మిర్చి రూ.30, బెండ రూ.42, బీరకాయలు రూ.48 , క్యారెట్ రూ.22/26, బీట్రూట్ రూ.24, బీన్స్ రూ.50, గ్రీన్ పీస్ రూ.54, గుత్తి వంకాయలు రూ.36, కీర రూ.22, గోరు చిక్కుడు రూ.34, నిమ్మకాయలు రూ.100, ఉసిరి కాయలు(హైబ్రిడ్) రూ.100, పొటల్స్ రూ.90గా నిర్ణయించారు.
News March 12, 2025
గాజువాక: ఎలక్ట్రికల్ పోల్ పడి ఒకరు మృతి

గాజువాక సమీపంలో గల నాతయ్యపాలెం డైరీ వద్ద మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఎలక్ట్రికల్ పోల్‌ను ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిలో కే.కోటపాడుకు చెందిన బొత్స కామేశ్వరరావు(37) తీవ్ర గాయాలవ్వగా స్థానికుల వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన నిన్న రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనలో గాయపడ్డ మరో మహిళ దొడ్డి సత్యవతి చికిత్స పొందుతోంది. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 12, 2025
విశాఖ: రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారికి అలర్ట్

జీవీఎంసీ పరిధిలో రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయినవారు TDR పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర రావు మంగళవారం తెలిపారు. వివరాలు నమోదు చేసుకున్న తర్వాత అధికారులు నిబంధనల ప్రకారం దరఖాస్తు పరిశీలించి TDRపై చర్యలు తీసుకుంటారని చెప్పారు. పూర్తి వివరాలకు జోనల్ కార్యాలయాలలో అసిస్టెంట్ సిటీ ప్లానర్లను సంప్రదించాలన్నారు.