News February 26, 2025

భూముల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకోండి 

image

రాష్ట్రంలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూములలో ఇళ్లు నిర్మించుకున్నవారు క్రమబద్దీకరణ చేసుకోవడానికి ముందుకు రావాలని జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ ఒక ప్రకటనలో కోరారు. మీసేవ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు.

Similar News

News February 26, 2025

శైవ క్షేత్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు: నెల్లూరు SP

image

నేడు(బుధవారం) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని శైవ క్షేత్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జి కృష్ణ కాంత్ తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సకాలంలో దర్శనం అయ్యేలా చూడాలని సూచించారు. శివరాత్రి జాగారం సమయంలో భక్తులు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని SP సూచించారు.

News February 26, 2025

నెల్లూరులో శివ‌రాత్రి శోభ‌.. విద్యుత్ కాంతుల్లో ఆలయాలు

image

మహాశివ‌రాత్రి ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకొని, నెల్లూరులోని శైవ‌క్షేత్రాలన్నీ విద్యుత్ కాంతుల‌తో ముస్తాబ‌య్యాయి. బుధ‌వారం శివ‌రాత్రి సంద‌ర్భంగా న‌గ‌రంలోని మూలాపేట, న‌వాబుపేట‌, గ‌ణేష్ ఘాట్, గుప్తా పార్క్, వీర‌బ్ర‌హ్మేంద్ర‌స్వామి త‌దిత‌ర శైవ క్షేత్రాల‌లో అన్నీ ఏర్పాట్లు చేశారు. ఆల‌యాల్లో భ‌క్తుల‌కి ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆల‌య అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.

News February 25, 2025

శైవ క్షేత్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు: SP

image

బుధవారం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని శైవ క్షేత్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సకాలంలో దర్శనం చేసేలా చూడాలని సూచించారు. శివరాత్రి జాగారం సమయంలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

error: Content is protected !!