News March 25, 2025

భూసమస్యలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి: మంత్రి అనగాని

image

భూసమస్యలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులను మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. వెలగపూడిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేట్ భూములు 22ఏలో ఉండకూడదన్నారు. పేదలకు న్యాయం చేయాలన్నదే సీఎం చంద్రబాబు తపన అని, 22ఏ, ఫ్రీహోల్డ్ భూములపై ప్రత్యేక డ్రైవ్‌- భూవివాదాలు పరిష్కారంపై కలెక్టర్లు శ్రద్ధ చూపాలని సూచించారు.

Similar News

News July 9, 2025

తెనాలి: ఆలయ హుండీలో రద్దైన నోట్లు

image

వైకుంఠపురం దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీల లెక్కింపులో రద్దైన పాత రూ.1000, రూ. 500 నోట్లు ప్రత్యక్షమయ్యాయి. ఆరు పాత రూ.1000 నోట్లు, పది పాత రూ.500 నోట్లు వెలుగు చూశాయి. ఆర్‌బీఐ చాలా ఏళ్ల క్రితమే ఈ నోట్లను రద్దు చేసినా, దేవుడి హుండీలో ఇవి కనిపించడం చర్చనీయాంశమైంది. జనవరిలో కూడా ఇక్కడ రూ.2000 నోట్లు లభ్యమయ్యాయి.

News July 9, 2025

గుంటూరులో స్పర్శ్ సీఎస్సీ శిక్షణ ప్రారంభం

image

గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ కార్యాలయంలో బుధవారం నుంచి నాలుగు రోజుల స్పర్శ్ సీఎస్సీ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. 5 జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థులకు రెండు రోజుల థియరీ, రెండు రోజుల ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నారని మాజీ సైనికుల రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస వరప్రసాద్ తెలిపారు. జులై 10, 11వ తేదీల్లో గుంటూరు, పరిసరాల మాజీ సైనికుల సమస్యలకు పరిష్కారం కల్పించనున్నట్టు చెప్పారు.

News July 9, 2025

GNT: తురకపాలెం రోడ్డులో వ్యక్తి దారుణ హత్య

image

నల్లపాడు పోలీసు స్టేషన్ పరిధిలోని తురకపాలెం రోడ్డులో కరిముల్లా హత్యకు గురయ్యాడు. స్తంభాలగరువుకు చెందిన నివాసిగా పోలీసులు నిర్థారించారు. కరిముల్లా అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు రెండ్రోజుల క్రితం పట్టాభిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన వ్యక్తి శవంగా మారడంతో కుటుంబ సభ్యులు మధురెడ్డి అనే వ్యక్తి పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.