News September 24, 2025

భూసేకరణ వేగవంతం చేయండి: కలెక్టర్ వెట్రిసెల్వి

image

జిల్లాలో జాతీయ రహదారులకు సంబందించిన భూసేకరణ వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులు, జాతీయ రహదారులకు సంబంధించిన అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మంగళవారం సమీక్షించారు. జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి కోర్ట్‌లలో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.

Similar News

News September 24, 2025

గుంటూరు జిల్లాలో రెండు కీలక పదవులపై ఉత్కంఠ

image

గుంటూరు జిల్లాలో మిర్చి యార్డు ఛైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్ష పదవులు ఇంకా ఖాళీగానే ఉండటంతో నేతల్లో ఆసక్తి నెలకొంది. రూ.1000 కోట్లకు పైగా లావాదేవీలు జరిగే యార్డు ఛైర్మన్ స్థానం ప్రతిష్టాత్మకమైందిగా భావించబడుతోంది. ఈ పీఠం కోసం పలువురు పోటీలో ఉన్నారు. మరోవైపు జిల్లా అధ్యక్ష బాధ్యతలు బీసీలకు ఇవ్వాలన్న ఆలోచనపై పార్టీ అధిష్ఠానం చర్చిస్తున్నట్లు సమాచారం. దసరా నాటికి ఈ రెండు పదవులపై స్పష్టత రానుంది.

News September 24, 2025

SKLM: అధికారులు అప్రమత్తంగా ఉండాలి

image

వాయుగుండం ప్రభావంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుండటంతో రానున్న 4 రోజులు జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం వెంబడి 40 నుంచి 50కి.మీ వేగంతో గాలులు విస్తాయన్నారు. 08942-240557ఈ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.

News September 24, 2025

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌దే గెలుపు: పొన్నం

image

TG: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే విజయమని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన కంటోన్మెంట్‌(ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు)లో జరిగిందే జూబ్లీహిల్స్‌లోనూ రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు. BRS ఇంకా అపోహల్లోనే బతుకుతోందని, ఆ పార్టీకి ఓటమి ఖాయమన్నారు. ఇక రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని పొన్నం వెల్లడించారు.