News April 16, 2025

భూసేకరణ వేగవంతం చేయాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్ 

image

జిల్లాలో జాతీయ రహదారి నిర్మాణ పనులకు సంబంధించి భూసేకరణ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణ, భూసేకరణ అంశాలపై అధికారులతో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ సమీక్షించారు. ఖమ్మం నుంచి దేవరపల్లి 365 బిజి (గ్రీన్ ఫీల్డ్ హైవే) కు రైతులకు ఇవ్వాల్సిన నగదు చెల్లించి భూములు స్వాధీనం చేసుకోవాలన్నారు.

Similar News

News September 14, 2025

MBNR: ఓపెన్ డిగ్రీ, PG.. గడువు పెంపు

image

బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ, పీజీలో అడ్మిషన్లకు ఈనెల 26 వరకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి పాలమూరు జిల్లా ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ Way2Newsతో తెలిపారు. రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లి చదవలేని విద్యార్థులు, ఉద్యోగులకు ఓపెన్ యూనివర్సిటీ ఒక మంచి అవకాశం అని సూచించారు. పూర్తి వివరాలకు https://braou.ac.in వెబ్‌సైట్‌లో సందర్శించాలన్నారు. SHARE IT

News September 14, 2025

BJP భౌగోళికంగా విస్తరించాల్సి ఉంది: సత్యకుమార్

image

AP: డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. PVN మాధవ్ సారథ్య యాత్ర ముగింపు సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ‘ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా APని తీర్చిదిద్దుతున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నాం. కేంద్రం, రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకులు పరిపాలిస్తున్నారు. రాష్ట్రంలో భౌగోళికంగా BJP ఇంకా విస్తరించాల్సి ఉంది’ అని అన్నారు.

News September 14, 2025

సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: SP

image

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం తెలిపారు. ఏదైనా సైబర్ మోసం జరిగిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు ప్రజల అత్యాశను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఈ వారంలో మొత్తం 20 సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయని ఎస్పీ వెల్లడించారు.