News April 4, 2025
భూ ఆక్రమణదారులకు మంచిర్యాల కలెక్టర్ వార్నింగ్

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు. గురువారం బెల్లంపల్లిలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడడంలో భాగంగా కోర్టులో కొనసాగుతున్న కేసుల సంబంధిత భూములు, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.
Similar News
News April 4, 2025
మల్యాల: మనస్తాపంతో వివాహిత సూసైడ్

మల్యాల మండలం బల్వంతపూర్‌కు చెందిన షేక్ బర్కత్ బీ(23) ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ నరేశ్ కుమార్ కథనం ప్రకారం.. హుస్సేన్ అనే వ్యక్తి తన వ్యక్తిగత సమాచారం వీడియో వైరల్ చేయడాన్ని భరించలేక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్ రాసింది. చావుకు హుస్సేన్ కారణమంటూ మృతురాలి సోదరుడు సయ్యద్ ఆదం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News April 4, 2025
IPL: రోహిత్ శర్మకు గాయం.. మ్యాచ్‌కు దూరం

LSGతో మ్యాచ్‌లో MI టాస్ గెలిచింది. కెప్టెన్ హార్దిక్ బౌలింగ్ ఎంచుకున్నారు. మోకాలి గాయం కారణంగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. అతడి స్థానంలో రాజ్ అంగద్ బవ MI తరఫున అరంగేట్రం చేశారు.
LSG: మార్ష్, మార్క్రమ్, పూరన్, పంత్, మిల్లర్, బదోని, సమద్, దిగ్వేశ్, శార్దూల్, అవేశ్, ఆకాశ్‌దీప్
MI: జాక్స్, రికెల్టన్, సూర్య, నమన్ ధిర్, పాండ్య, రాజ్‌అంగద్, శాంట్నర్, దీపక్, బౌల్ట్, విఘ్నేశ్, అశ్వనీ కుమార్
News April 4, 2025
వరంగల్‌కు పుష్-పుల్ ట్రైన్ నడపండి.. ఎంపీ కావ్య విజ్ఞప్తి

ఉదయం వేళ వరంగల్ నుంచి హైదరాబాద్‌కు పుష్-పుల్ రైలు నడపాలని శుక్రవారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈమేరకు పార్లమెంట్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆమె మాట్లాడుతూ.. పేద మధ్యతరగతి ప్రజలు రోజువారీ పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్తుంటారని, వారికి సౌకర్యార్థంగా రైళ్లను నడపాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.