News January 10, 2026
‘భూ భారతి’ ఛార్జీల చెల్లింపు అక్రమాలపై విచారణకు ఆదేశం

TG: ‘భూ భారతి’ రిజిస్ట్రేషన్ ఛార్జీల చెల్లింపులో <<18804858>>అక్రమాలపై<<>> లోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. సమగ్ర నివేదిక సమర్పించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ&భూ పరిపాలన శాఖ అధికారులకు నిర్దేశించింది. ఈ స్కామ్‌లో యాదగిరిగుట్టకు చెందిన ఓ మీ సేవ నిర్వాహకుడే ప్రధాన సూత్రధారి అని తెలుస్తోంది. పోర్టల్‌కు నకిలీ ప్రింటర్ యాప్‌ను జోడించి తప్పుడు రశీదులు సృష్టించినట్లు సమాచారం.
Similar News
News February 11, 2026
151 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL)151 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిప్లొమా, ఇంటర్, టెన్త్, ITI అర్హత గలవారు నేటి నుంచి FEB 25 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, DV ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.21,000-23,000తో పాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. సైట్: https://hal-india.co.in
News February 11, 2026
అంకితభావంతో పనిచేస్తే రిజల్ట్ ఇలా ఉంటుంది!

ఇండోర్(MP) మున్సిపల్ కమిషనర్‌గా IAS అధికారి అశీష్ సింగ్ అద్భుతం చేశారు. 2018లో 6 నెలల్లో 13 లక్షల టన్నుల వ్యర్థాలను తొలగించి రూ.400కోట్ల విలువైన 100 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. అద్దె యంత్రాలు వాడటంతో ₹65 కోట్ల ఖర్చును ₹10 కోట్లకు తగ్గించారు. ఆయన చూపిన పాలనా దక్షతతోనే ఇండోర్ నేడు దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా వెలుగొందుతోంది. ఇలాంటి అంకితభావం కలిగిన అధికారులే దేశానికి అవసరం. ఏమంటారు?
News February 11, 2026
తేనెతో జుట్టుకు పోషణ

తేనె వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. అయితే తేనె సౌందర్య పరిరక్షణలో, జుట్టు సంరక్షణలోనూ కీలకపాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. * తేనె, ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేయడం వల్ల జుట్టు పట్టులా మెరుస్తుందని చెబుతున్నారు. *తలస్నానం చేసేముందు తేనె, పాలు కలిపి తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా తయారవుతుందని తెలిపారు.


