News April 16, 2025
భూ భారతి పైలట్ ప్రాజెక్టుగా మద్దూరు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలులోకి తెచ్చిన భూ భారతి మొదటగా పైలట్ ప్రాజెక్టుగా మన నారాయణపేట జిల్లా మద్దూరు మండలాన్ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మద్దూరు మండలంలో మొత్తం 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటిలో కలిపి మొత్తం 30,621 ఎకరాల పొలం ఉండగా.. అందులో 30,473 ఎకరాలు వ్యవసాయ ఆమోదయోగ్యమైన భూములు ఉన్నాయి. మండలంలో ఈనెల 17 నుంచి నెలాఖరు వరకు అధికారులు గ్రామసభలు నిర్వహించనున్నారు.
Similar News
News April 16, 2025
ఏప్రిల్ 19న అనంత JNTUలో వార్షికోత్సవ వేడుకలు

అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 19న కళాశాల 79వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఎస్.వసుంధర్ తెలిపారు. దీనికి సంబంధించి కళాశాలలో ఏర్పాటు చేసే సాంస్కృతిక, వికాసిక, క్రీడా కార్యక్రమాలలో ప్రతి విద్యార్థి, సిబ్బంది ఉత్సాహంతో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
News April 16, 2025
పామిడి విద్యార్థినికి లోకేశ్ సన్మానం

ప్రభుత్వ కాలేజీలో చదివి ఇంటర్‌లో 987 మార్కులు సాధించిన పామిడి యువతి ధృతికాబాయిని మంత్రి నారా లోకేశ్ సన్మానించారు. ల్యాప్ టాప్, గోల్డ్ మెడల్ అందజేసి అభినందించారు. ధృతికాబాయి ఎమ్మిగనూరులోని బనవాసి గురుకుల జూనియర్ కళాశాలలో చదివారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో టాపర్‌లుగా నిలిచిన విద్యార్థులు ప్రభుత్వ విద్య పరువును కాపాడారని మంత్రి అన్నారు.
News April 16, 2025
పల్నాడు: కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డ తండ్రి.. అరెస్ట్

సొంత కూతురిపై లైంగిక దాడికి ఒడిగట్టిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తునకు తీసుకున్నారు. నిందితుడిని తెనాలిలోని కొలకలూరు కాలువ కట్టవద్ద గుర్తించి, రూరల్ సీఐ ఉమేశ్ చంద్ర, ఎస్ఐ కట్టా ఆనంద్ బృందం మంగళవారం అదుపులోకి తీసుకుంది. నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.