News April 15, 2025
భూ భారతి పైలెట్ ప్రాజెక్టుగా మద్దూరు మండలం ఎంపిక

భూభారతిపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సమావేశానికి నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ హాజరయ్యారు. భూభారతి పైలట్ ప్రాజెక్ట్ సదస్సులను జిల్లాలోని మద్దూరు మండలాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు.
Similar News
News January 10, 2026
కోనసీమ: బ్లో అవుట్.. ఆదుకోనున్న ‘బీఓపీ’

ఇరుసుమండ బ్లో అవుట్ నివారణలో బ్లో అవుట్ ప్రివెంటర్ (బీఓపీ) కీలకమని నిపుణులు తెలిపారు. డ్రిల్లింగ్ సమయంలో అత్యధిక ఒత్తిడితో గ్యాస్ పైకి రాకుండా ఈ భారీ వాల్వ్ అడ్డుకుంటుందని వివరించారు. వెల్ క్యాపింగ్ కోసం ప్రస్తుతం ఈ పరికరాన్ని సిద్ధం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రాణ నష్టాన్ని నివారించడంలో దీని పాత్ర అత్యంత కీలకమని నిపుణులు పేర్కొన్నారు.
News January 10, 2026
MBNR: ప్రభుత్వ వైద్య కళాశాలలో పలు పోస్టులకు దరఖాస్తులు

మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జూనియర్ రెసిడెంట్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. ఆసక్తి గల వారు తమ అసలు ధ్రువపత్రాలతో కళాశాలకు రావాలని ప్రకటనలో పేర్కొన్నారు.
News January 10, 2026
కేసీఆర్ సాగు సంస్కరణలతోనే ఈ ఘనత: నిరంజన్ రెడ్డి

వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలవడంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో తెచ్చిన సాగు సంస్కరణల వల్లే ఈ ఘనత దక్కిందని, రాష్ట్రం 240 శాతం వృద్ధి సాధించిందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ నివేదికే ఇందుకు నిదర్శనమని తెలిపారు. పదేళ్ల కృషి ఫలితంగానే నేడు తెలంగాణ అన్నపూర్ణగా మారిందని ఆయన స్పష్టం చేశారు.


