News July 18, 2024
భూ వివాదం.. మహిళపై దాడి

భూ వివాదంలో ఓ మహిళపై మాజీ ఉపసర్పంచ్ దాడిచేసిన ఘటన పెద్దవూర మండలం తేప్పలమడుగులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జానపాటి సునీతపై మాజీ ఉపసర్పంచ్ పల్లెబోయిన శంకర్, అతని కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో NLGలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు స్పందించి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు.
Similar News
News August 27, 2025
NLG: ‘ఇన్ స్పైర్ మనక్’పై ఆసక్తి ఏది?!

పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీసేందుకు ‘ఇన్ స్పైర్ మనక్’ చక్కటి వేదికగా నిలుస్తోంది. విద్యార్థులు భావిభారత శాస్త్రవేత్తలు ఎదిగేందుకు కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా శాస్త్రసాంకేతిక శాఖ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ద్వారా ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లాలో విద్యార్థులతో నామినేషన్లు చేయించేందుకు HMలు, ఉపాధ్యాయులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది.
News August 27, 2025
NLG: పంచాయతీ ఎన్నికలు.. కలెక్టర్ కీలక ఆదేశం.!

గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన పనులు వేగవంతం అయ్యాయి. ఓటర్ల జాబితాతోపాటు పోలింగ్ కేంద్రాలను ఖరారు చేసేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అందుకు అనుగుణంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు అసిస్టెంట్ జిల్లా ఎన్నికల అధికారులు, ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేశారు.
News August 27, 2025
NLG: ముగిసిన ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ!

ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ముగిసింది. జిల్లాలో గెజిటెడ్ హెచ్ఎంల పదోన్నతుల ప్రక్రియను ఇటీవల పూర్తి చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఎస్టీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించింది. జిల్లాలో 156 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు గాను 148 పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేశారు. వారంతా మంగళవారం విధుల్లో చేరడంతో ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ముగిసింది.