News April 19, 2025
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి భూ భారతి: కలెక్టర్

ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం భూ భారతిని అమలు చేస్తున్నట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. భూ భారతి పోర్టల్ అమలులో భాగంగా శుక్రవారం అల్లాదుర్గం మండలం చేవెళ్ల గ్రామంలో రైతు వేదికలో భూ భారతి చట్టం -2025పై అవగాహన కార్యక్రమంలో హాజరయ్యారు. అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో రమాదేవి, తహశీల్దార్ మల్లయ్య, కాగ్రెస్ మండల ప్రెసిడెంట్ శేషా రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
Similar News
News October 27, 2025
పేదలకు సత్వర న్యాయం అందించాలి: కలెక్టర్ రాహుల్ రాజ్

పేద ప్రజలకు సత్వర న్యాయం అందించాలని, విధుల్లో నిబద్ధత, క్రమశిక్షణ పాటించాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. జిల్లాలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఐదుగురు ఎంపీడీవోలతో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. మండలాల అభివృద్ధిలో ఎంపీడీవోల పాత్ర కీలకమని, పారదర్శక పాలనే లక్ష్యంగా ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు.
News October 27, 2025
స్వగ్రామానికి చేరిన తల్లి, కూతురు మృతదేహాలు

కర్నూలు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన మంగ సంధ్యారాణి (43), ఆమె కుమార్తె చందన (23) మృతదేహాలు స్వగ్రామం మెదక్ మండలం శివాయిపల్లికి చేరాయి. డీఎన్ఏ పరీక్షల అనంతరం నిన్న సాయంత్రం కుటుంబీకులకు అప్పగించారు. భర్త ఆనంద్ గౌడ్ మృతదేహాలను తీసుకొచ్చారు. మృతదేహాలను చూసి కుటుంబసభ్యులు బోరున విలపించారు. ఈరోజు మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి.
News October 27, 2025
పాపన్నపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

పాపన్నపేట మండలంలోని మల్లంపేట గ్రామానికి చెందిన యువకుడు తరుణ్ రెడ్డి (25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆదివారం రాత్రి తరుణ్ రెడ్డి సంగారెడ్డి నుంచి జోగిపేట వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఫసల్వాది వద్ద జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తరుణ్ రెడ్డి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


