News September 22, 2025

భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి: CM

image

జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డా.బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు. దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తికావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ స్నేహ శబరీశ్, డీఎఫ్‌వో లావణ్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Similar News

News September 22, 2025

NGKL: ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి: అదనపు కలెక్టర్‌

image

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 25 ఫిర్యాదులు అందినట్లు అదనపు కలెక్టర్‌ అమరేందర్ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏవో చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

News September 22, 2025

TGPSCకి ముగ్గురు కొత్త సభ్యులు

image

TGPSCకి కొత్తగా ముగ్గురు సభ్యులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రకాంత్ రెడ్డి, విశ్వప్రసాద్ (IPS), ప్రొఫెసర్ L.B.లక్ష్మీకాంత్ రాథోడ్‌లను సభ్యులుగా నియమించింది. వీరు ఆరేళ్ల పాటు లేదా వారికి 62 ఏళ్లు వచ్చేంత వరకు పదవుల్లో కొనసాగుతారని పేర్కొంది.

News September 22, 2025

NRPT: బతుకమ్మ సంబురాలను వైభవంగా నిర్వహించాలి: కలెక్టర్

image

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా జిల్లాలో బతుకమ్మ సంబురాలను వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. నారాయణపేట కలెక్టరేట్‌లో సోమవారం వివిధ శాఖల అధికారులతో సమావేశమై బతుకమ్మ వేడుకల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. వేడుకల్లో అన్ని శాఖలు భాగస్వామ్యం కావాలని, ఈ నెల 30న సద్దుల బతుకమ్మను పెద్ద ఎత్తున నిర్వహించాలని కోరారు.