News February 16, 2026
భైంసాలో బద్దలైన మజ్లిస్ కోట

TG: నిర్మల్ (D) భైంసా మున్సిపల్ ఛైర్మన్ పీఠం గత 20 ఏళ్లుగా MIM చేతుల్లోనే ఉండేది. తాజా ఎన్నికల్లో 26 వార్డులకు గాను MIM 12, BJP 6, కాంగ్రెస్ 1, స్వతంత్రులు 7 చోట్ల గెలిచారు. మరోసారి MIM ఛైర్మన్ పీఠం దక్కించుకుంటుందని అంతా భావించారు. అయితే స్వతంత్రులకు బీజేపీ మద్దతు తెలిపింది. దీంతో ఇండిపెండెంట్లు దత్తాత్రి (బీజేపీ రెబల్), ఖతీజా బేగం (MIM రెబల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అయ్యారు.
Similar News
News February 17, 2026
రోడ్లు శుభ్రంగా లేకుంటే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తా: CM

TG: మున్సిపల్ అధికారులు, కమిషనర్లపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. ‘త్వరలో GHMCలోని ప్రతి జోన్‌లో పర్యటిస్తా. రోడ్లు శుభ్రంగా లేకపోతే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తా. కమిషనర్లు, జోనల్ కమిషనర్‌లు పొద్దునే ఫీల్డ్‌లో ఉండాలి. చాలా మంది వెళ్లట్లేదు. అలాంటి అధికారులపై వేటు వేస్తా’ అని మున్సిపల్ శాఖ సమీక్షలో హెచ్చరించారు. GHMC 3 కార్పొరేషన్లలో శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
News February 17, 2026
నటికి చేదు అనుభవం.. వాష్‌రూమ్‌లో వీడియో తీసి బ్లాక్‌మెయిల్

ఓ కన్నడ టీవీ నటికి చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరులోని ఓ ఇండోర్ స్టేడియంలో ఈవెంట్‌కు హాజరవగా అక్కడి వాష్‌రూమ్‌లో ఓ వ్యక్తి ఆమె వీడియోను రహస్యంగా చిత్రీకరించాడు. దానిని ఇన్‌స్టాలో పంపి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోను వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 17, 2026
ఏఐ సాయంతో పిటిషన్లు.. సీజేఐ ఆందోళన

న్యాయవ్యవస్థలో ఏఐ వాడకంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. కొందరు న్యాయవాదులు పిటిషన్లను ఏఐ సాయంతో రూపొందిస్తున్నారని పేర్కొంది. కల్పిత కేసులు/చట్టాలు, ఉనికిలో లేని జుడీషియల్ కోట్స్‌ను సమర్పిస్తున్నారని తెలిపింది. దీనివల్ల న్యాయ ప్రక్రియ సమగ్రత, నైతికతకు ముప్పు కలుగుతుందని, వృత్తిపరమైన సవాళ్లు ఎదురవుతాయని హెచ్చరించింది. ఈ రంగంలో ఏఐ వినియోగంపై నియంత్రణ అవసరమంది.


