News February 9, 2025

భైంసాలో రోడ్డు ప్రమాదం.. బాలుడు మృతి

image

భైంసా మండలం వానల్‌పాడ్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న అనిల్(14)ను హైవేపై గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో అనిల్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 31, 2025

మంచిర్యాల: రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్

image

మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు, చిత్రకళ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ భారతీయ కళాకార్ సంఘ్ తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. అక్టోబర్ 28, 29 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగిన జాతీయ కళాకార్ సంఘ్ సమావేశంలో ఆయనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతలు అప్పగించి నియామక పత్రం అందజేశారు. చిత్రకారులు ఆయనకు అభినందనలు తెలిపారు.

News October 31, 2025

5 కేజీల భారీ నిమ్మకాయలను పండిస్తున్న రైతు

image

నిమ్మకాయ బాగా పెరిగితే కోడిగుడ్డు సైజులో ఉంటుంది. అయితే కర్నాటకలోని కొడుగు జిల్లా పలిబెట్టకు చెందిన విజు సుబ్రమణి అనే రైతు భారీ నిమ్మకాయలను పండిస్తున్నారు. ఇవి ఒక్కోటి పెద్ద సైజులో 5 కేజీల వరకు బరువు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం మైసూరు వెళ్లినప్పుడు అక్కడ మార్కెట్‌లో నిమ్మ విత్తనాలను కొని తన కాఫీ తోటలో సుబ్రమణి నాటారు. మూడేళ్ల తర్వాత నుంచి వాటిలో 2 మొక్కలకు ఈ భారీ సైజు నిమ్మకాయలు కాస్తున్నాయి.

News October 31, 2025

చిత్తూరు మేయర్ హత్య కేసు వివరాలు ఇలా..!

image

➤ హత్య జరిగిన తేది: 2015 నవంబర్ 17
➤ హత్య జరిగిన ప్రాంతం: చిత్తూరు కార్పొరేషన్ ఆఫీస్
➤ తుపాకీ కాల్పులకు అనురాధ మృతి
➤ కత్తులతో పొడవడంతో మోహన్ మృతి
➤ 130 మంది సాక్షుల విచారణ
➤ 352 సార్లు వాయిదా పడిన కేసు
➤ ఉరిశిక్ష పడింది: చింటూ(A1), వెంకట చలపతి(A2), జయ ప్రకాష్ రెడ్డి(A3), మంజు నాథ్(A4), వెంకటేశ్(A5)